తల్లిదండ్రుల వాట్సాప్‌నకు టెన్త్ హాల్‌టికెట్లు
పదోతరగతి వార్షిక పరీక్షలకు విద్యాశాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నది. ఈ సారి తల్లిదండ్రుల వాట్సాప్‌నకు టెన్త్ హాల్‌టికెట్లను పంపించనున్నది. రిజిస్ట్రేషన్ చేసుకున్న మొబైల్ నంబర్‌కు వీటిని పంపిస్తారు. ఈ సారి నుంచి హాల్‌టికెట్లపై క్యూఆర్‌కోడ్ ముద్రిస్తున్నారు.
- హాల్‌టికెట్లపై క్యూఆర్‌కోడ్
- స్కాన్ చేయగానే సెంటర్ అడ్రస్ ప్రత్యక్షం
హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ) : పదోతరగతి వార్షిక పరీక్షలకు విద్యాశాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నది. ఈ సారి తల్లిదండ్రుల వాట్సాప్‌నకు టెన్త్ హాల్‌టికెట్లను పంపించనున్నది. రిజిస్ట్రేషన్ చేసుకున్న మొబైల్ నంబర్‌కు వీటిని పంపిస్తారు. ఈ సారి నుంచి హాల్‌టికెట్లపై క్యూఆర్‌కోడ్ ముద్రిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్‌తో ఈ క్యూఆర్‌కోడ్‌ను స్కాన్ చేయగానే గూగుల్ మ్యాప్‌లతో నావిగేట్ వస్తుంది. విద్యార్థులు తమ సెంటర్ రూట్ మ్యాప్‌ను అనుసరించవచ్చని విద్యా శాఖ అధికారులు తెలిపారు.
5న హాల్‌టికెట్ల విడుదల
పదో తరగతి హాల్‌టికెట్లను మార్చి 5న విడుదల చేస్తారు. వెబ్సైట్లో విడుదల చేయడంతోపాటు, తల్లిదండ్రుల వాట్సాప్‌నకు సైతం పంపిస్తారు. అదే తేదీలోపు ప్రింటెడ్ హాల్‌టికెట్లను సైతం స్కూళ్లకు చేరవేస్తారు. హాల్‌టికెట్ల కోసం https://bse.telanga na.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు. పదో తరగతి వార్షిక పరీక్షలు మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరుగనున్నాయి. ఈ సారి 5,17,727 మంది రెగ్యులర్ విద్యార్థులు, 10,512 మంది ప్రైవేట్ విద్యార్థులు కలుపుకుని మొత్తంగా 5,28,238 మంది పరీక్షలకు హాజరుకాబోతున్నారు. నిరుటితో పోల్చితే 20వేల మంది విద్యార్థులు పెరిగారు. దీంతో సెంటర్ల సంఖ్యను కూడా పెంచారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

