Elephant | కర్ణాటక (Karnataka)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ ఏనుగు (Elephant) బీభత్సం సృష్టించింది. టూరిస్ట్‌ను వెంబడించి దాడి చేసింది. అయితే, అదృష్టవశాత్తూ ఏనుగు దాడి నుంచి ఆ టూరిస్ట్ ప్రాణాలతో బయటపడగలిగాడు. ఈ ఘటన బందీపూర్ టైగర్ రిజర్వ్ (Bandipur Tiger Reserve)లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది.
చామరాజనగర్ (Chamarajanagar)లోని బందీపూర్ టైగర్ రిజర్వ్‌లోని కెక్కనహళ్లి రోడ్డులో ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది. రోడ్డుపై వెళ్తున్న వాహనదారులను భయాందోళనకు గురిచేసింది. ఈ క్రమంలో కేరళకు చెందిన ఓ టూరిస్ట్ (Kerala tourist)పైకి అకస్మాత్తుగా దూసుకెళ్లింది. దీంతో సదరు టూరిస్ట్ ఏనుగు నుంచి తప్పించుకునేందుకు పరిగెత్తాడు. కొంచెం దూరం వెళ్లాక రోడ్డుపై పడిపోయాడు. దీంతో అతడిపై ఏనుగు దాడి చేసింది. ఈ దాడిలో సదరు టూరిస్ట్ ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే, తీవ్ర గాయాలు కావడంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భయాందోళన వాతావరణం నెలకొంది.
A tourist from Kerala was injured after being attacked by a wild elephant on Kekkanahalli Road in Chamarajanagar’s Bandipur Tiger Reserve.The elephant reportedly pinned the tourist under its foot, but he managed to escape with injuries. #elephant #attack #bandipur #kerala pic.twitter.com/5PcvGeUCU1
— NextMinute News (@nextminutenews7) August 11, 2025
Also Read..
KC Venugopal | ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం.. కేసీ వేణుగోపాల్‌కు తృటిలో తప్పిన ప్రమాదం
Traffic Jam | ప్రాణం తీసిన ట్రాఫిక్ జామ్! మహారాష్ట్రలో ఘటన
Bombay Highcourt | భార్య వంటను తప్పుబట్టడం క్రూరత్వం కాదు