Traffic Jam | ముంబై: బీజేపీ పాలిత మహారాష్ట్రలో ఒక మహిళ మృతి.. రాష్ట్రంలో వైద్య సదుపాయాల దయనీయ స్థితిని, రవాణా సదుపాయాల లేమిని ఏకకాలంలో బయటపెట్టింది. మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లా మధుకర్ నగర్‌కు చెందిన 49 ఏండ్ల ఛాయా పురవ్.. చెట్టు కూలిన ఘటనలో తీవ్రంగా గాయపడింది.
స్థానికంగా వైద్య సదుపాయాలు లేకపోవటంతో అంబులెన్స్‌లో ముంబైలోని హిందూజా దవాఖానకు ఆమెను తరలిస్తుండగా.. జాతీయ రహదారిపై భీకరమైన ట్రాఫిక్ జామ్ ఆమె ప్రాణాల్ని బలిగొన్నది. కనీసం 30 నిమిషాల ముందు దవాఖానకు చేరుకుంటే ఆమెను కాపాడగలిగే వాళ్లమంటూ వైద్యులు చెప్పారని..
మృతురాలి భర్త కౌశిక్ కన్నీటి పర్యంతమయ్యాడు. జూలై 31న ఇంటి సమీపంలో ఒక చెట్టుకొమ్మ పడటంతో పురవ్ తీవ్రంగా గాయపడ్డారు. గుంతలతో కూడిన రోడ్లు, ట్రాఫిక్ జామ్ కారణంగా సరైన సమయంలో ముంబైలోని దవాఖానకు చేరుకోలేకపోయారు.