Arvind Kejriwal | భారత రెజ్లింగ్ సమాఖ్య (WFA) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ (Brij Bhushan)కు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న రెజ్లర్లకు (Wrestlers), ఢిల్లీ పోలీసులకు మధ్య అర్ధరాత్రి ఘర్షణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. రెజ్లర్ల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరుపై ఆప్ (AAP) కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి (Delhi Cm) అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) స్పందించారు. దేశంలోని చాంపియన్ ప్లేయర్ల పట్ల ఇలా దుర్మార్గంగా ప్రవర్తించడం సిగ్గుచేటన్నారు. బీజేపీ (BJP) ని తరిమికొట్టే సమయం ఆసన్నమైంది అని అన్నారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు.
‘దేశంలోని చాంపియన్ ప్లేయర్లతో ఇలా దుర్మార్గంగా ప్రవర్తించడం విచారకరం, సిగ్గుచేటు. ఈ వ్యక్తులు (బీజేపీ) మొత్తం వ్యవస్థను గుండాయిజంతో నడపాలని కోరుకుంటున్నారు. మొత్తం వ్యవస్థను అపహాస్యం చేస్తున్నారు. ఇకపై దేశంలోని ప్రజలు బీజేపీ గూండాయిజాన్ని సహించొద్దు.. బీజేపీని తరిమికొట్టే సమయం ఆసన్నమైంది’ అని అన్నారు.
లైంగిక వేధింపులకు పాల్పడిన భారత రెజ్లింగ్ ఫెడరేషన్ చైర్మన్ (WFI president ) బ్రిజ్ భూషణ్ (Brij Bhushan) పై చర్యలు తీసుకోవాలని టాప్ రెజ్లర్లు (Wrestlers) ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఢిల్లీ (Delhi)లోని జంతర్ మంతర్ (Jantar Mantar) వద్ద గత కొన్ని రోజులుగా రెజ్లర్లు చేపడుతున్న ధర్నా కొనసాగుతోంది. ఈ క్రమంలో బుధరవారం అర్ధరాత్రి రెజ్లర్లు, పోలీసుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
నిరసన తెలుపుతున్న రెజ్లర్ల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎమ్మెల్యే సోమనాథ్ భారతి (MLA Somnath Bharti) బుధవారం రాత్రి మడత మంచాలు తీసుకొచ్చారు. అయితే వారికి వాటిని ఇచ్చేందుకు పోలీసులు అనుమతించలేదు. అనప్పటికీ వారు ట్రక్కు నుంచి మంచాలు, పరుపులను బయటకు తీయడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో రెజ్లర్లు, ఎమ్మెల్యే అనుచరులు.. పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో రెజ్లర్లు బజరంగ్ పునియా (Bajrang Punia), వినేశ్ ఫొగట్ (Vinesh Phogat)తోపాటు పలువురికి తలపై గాయాలయ్యాయి.
देश के चैम्पियन खिलाड़ियों के साथ इतना ग़लत बर्ताव..? ये बेहद दुखद और शर्मनाक है।
घमंड में पूरी भाजपा का दिमाग़ ख़राब हो चुका है। ये लोग सिर्फ़ गुंडागर्दी से सारा सिस्टम हाँकना चाहते हैं। पूरे सिस्टम का मज़ाक़ बनाकर रख दिया है इन्होंने।
देश के सभी लोगों से मेरी अपील- अब बस…… https://t.co/4R5mj12kOk
— Arvind Kejriwal (@ArvindKejriwal) May 4, 2023
Also Read..
Vinesh Phogat | ఇలాంటి రోజులు చూసేందుకేనా పతకాలు సాధించింది..? : కన్నీటి పర్యంతమైన వినేశ్ ఫోగట్
Mary Kom | నా రాష్ట్రం మణిపూర్ మండిపోతోంది.. సాయం చేయండి : మేరీ కోమ్
Army chopper | జమ్మూ కశ్మీర్లో కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్