Army chopper | జమ్మూకశ్మీర్ ( Jammu and Kashmir) లోని కిశ్త్‌వాఢ్ (Kishtwar) సమీపంలో ఓ ఆర్మీ హెలికాప్టర్ (Army chopper) గురువారం కుప్పకూలింది. ప్రమాద సమయంలో హెలికాప్టర్లో ముగ్గురు అధికారులు ఉన్నట్లు సమాచారం. మార్వా ప్రాంతంలోని నదిలో హెలికాప్టర్ శకలాలు గుర్తించారు. ఈ ప్రమాదంలో పైలట్లకు గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు.
‘ఆర్మీ ఏఎల్‌హెచ్ ధ్రువ్ హెలికాప్టర్ (ALH Dhruv Helicopter) జమ్మూకశ్మీర్‌లోని కిశ్త్‌వాఢ్ సమీపంలో కుప్పకూలింది. ప్రమాద సమయంలో చాపర్‌లో ముగ్గురు ఉన్నారు. వారు గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు’ అని ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి.
An Army ALH Dhruv Helicopter crashed near Kishtwar, Jammu & Kashmir. pic.twitter.com/6twRIaLuzI
— ANI (@ANI) May 4, 2023
Also Read..
Russia – Ukraine | ఖేర్సన్‌పై క్రెమ్లిన్ ప్రతీకార దాడి.. 21 మంది పౌరులు మృతి
Bellamkonda Sreenivas | రష్మికతో డేటింగ్‌పై క్లారిటీ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్
BRS Bhavan | బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీ భవన్ టైమ్‌లైన్