Bellamkonda Sreenivas | రష్మికతో డేటింగ్‌పై క్లారిటీ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్
Bellamkonda Sreenivas | టాలీవుడ్ (Tollywood) స్టార్ నటి రష్మిక మందన ( Rashmika Mandanna), హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas) ఇద్దరూ డేటింగ్లో ఉన్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపస్తున్న విషయం తెలిసిందే. రష్మికతో డేటింగ్‌పై తాజాగా నటుడు స్పందించాడు.
Bellamkonda Sreenivas | టాలీవుడ్ (Tollywood) స్టార్ నటి రష్మిక మందన ( Rashmika Mandanna), హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas) ఇద్దరూ డేటింగ్లో ఉన్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపస్తున్న విషయం తెలిసిందే. విమానాశ్రయాల్లో ఇద్దరూ కలిసి జంటగా కనిపించడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ పలు వెబ్సైట్లు, సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. కాగా, రష్మికతో డేటింగ్‌పై తాజాగా నటుడు స్పందించాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీనివాస్ డేటింగ్ రూమర్స్ (Dating Rumors) పై క్లారిటీ ఇచ్చారు. ఇలాంటి వార్తలు ఎలా సృష్టిస్తారంటూ అసహనం వ్యక్తం చేశారు.
హిందీ చిత్రం ‘ఛత్రపతి’ (Chatrapathi) ప్రచారంలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ‘రష్మికతో నేను ప్రేమలో ఉన్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. మేమిద్దరం మంచి స్నేహితులం మాత్రమే. షూటింగ్ పనిపై ముంబైకి వెళ్లినప్పుడు విమానాశ్రయంలో కలుసుకుంటూ ఉంటాం. అలా అనుకోకుండా కలుసుకున్న సందర్భాలు చాలా తక్కువే. అంత మాత్రానికే ఇలాంటి వార్తలు రాసేస్తారా..? ఈ వార్తలన్నీ కేవలం పుకార్లు మాత్రమే. వాటిని నమ్మొద్దు’ అంటూ చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ హిందీ చిత్రం ‘ఛత్రపతి’లో (Chatrapathi) నటిస్తున్నారు. వి.వి వినాయక్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో శ్రీనివాస్ సరసన నుస్రత్ భరుచా నటిస్తోంది.ఎస్ఎస్ రాజమౌళి-ప్రభాస్ కాంబోలో రిలీజై ఇండస్ట్రీ రికార్డులను సృష్టించిన తెలుగు ‘ఛత్రపతి’కి రీమేక్ ఇది. ఈ చిత్రంలో భాగ్య శ్రీ, శరద్ కేల్కర్, శివమ్ పాటిల్, ఫ్రెడ్డి దారువాలా, రాజేంద్ర గుప్తా, సహిల్ వైద్ ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి తనిష్క్ బాఘ్చీ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్, పాటలకు మంచి స్పందన వచ్చింది. మే 12న ఛత్రపతి ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read..
Rain alert | రాష్ట్రంలో మరో రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
Delhi Fog | ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. మే నెలలో 13 ఏండ్ల కనిష్టానికి ఉష్ణోగ్రతలు
Vinesh Phogat | ఇలాంటి రోజులు చూసేందుకేనా పతకాలు సాధించింది..? : కన్నీటి పర్యంతమైన వినేశ్ ఫోగట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

