Rain alert | రాష్ట్రంలో మరో రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
రాష్ట్రంలో మరో రెండు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD Hyderabad) తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది.
హైదరాబాద్: రాష్ట్రంలో మరో రెండు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD Hyderabad) తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. సుమారు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ప్రకటించింది. ఈ నెల 6న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉన్నదని, దీని ప్రభావంతో 7న అదే ప్రాంతంలో ఆల్పపీడనం ఏర్పడవచ్చని తెలిపింది. ఆ తర్వాత ఇది తీవ్ర అల్పపీడనంగా కేంద్రీకృతమై ఈనెల 9 నాటికి తుఫానుగా బలపడవచ్చని చెప్పింది. ఈ తుపాను ఉత్తర దిశగా కదులుతూ బంగాళాఖాతం వైపు కదులుతూ తీవ్రతరం అయ్యే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు.
సాధారణంగా రుతుపవనాలకు ముందు ఏప్రిల్-మే-జూన్ సీజన్లో బంగాళాఖాతంలో తరచూ తుఫానులుగా ఏర్పడుతుంటాయి. మేలో వీటి ముప్పు మరింత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక దేశంలో అక్టోబరు-డిసెంబర్ మధ్య తిరోగమన రుతుపవనాల ప్రభావంతో మరో తుఫాను సీజన్ ఉంటుంది. వీటికి తోడు పశ్చిమతీరంలోని అరేబియాసముద్రంలో కూడా తుపానులు ఏర్పడుతుంటాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fake Potatoes | మార్కెట్లో విరివిగా కల్తీ ఆలుగడ్డలు.. గుడ్డిగా కొనుగోలు చేస్తే అంతే సంగతి..!
Team India | దక్షిణాఫ్రికా పర్యటనకు భారత మహిళా క్రికెట్ జట్టు.. డిసెంబర్ 9న టూర్ షురూ..!
Almonds | రోజూ కొన్ని బాదంపప్పులను తినడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఇవే.. అధ్యయనాల్లో తేలిన నిజాలు..
Sheikh Hasina | తిరిగి రావడానికి కొత్త పాస్‌పోర్ట్ ఇవ్వండి.. బంగ్లాదేశ్‌ను కోరిన షేక్ హసీనా..!
కారేపల్లి ఎస్ఐగా రమేశ్ బాధ్యతలు స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

