Vinesh Phogat | లైంగిక వేధింపులకు పాల్పడిన భారత రెజ్లింగ్ ఫెడరేషన్ చైర్మన్ (WFI president ) బ్రిజ్ భూషణ్ (Brij Bhushan) పై చర్యలు తీసుకోవాలని టాప్ రెజ్లర్లు (Wrestlers) ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఢిల్లీ (Delhi)లోని జంతర్ మంతర్ (Jantar Mantar) వద్ద గత కొన్ని రోజులుగా రెజ్లర్లు చేపడుతున్న ధర్నా కొనసాగుతోంది. ఈ క్రమంలో రెజ్లర్లకు (Wrestlers), ఢిల్లీ పోలీసులకు మధ్య బుధవారం అర్ధరాత్రి ఘర్షణ చోటుచేసుకుంది. ఈ తోపులాటలో అధికారులు తమపై దాడి చేశారని, దూషించారని అథ్లెట్లు ఆరోపించారు. ఈ సందర్భంగా టాప్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ (Vinesh Phogat) మాట్లాడారు.
ఇలాంటి రోజులు చూడటానికేనా..! తాము పతకాలు సాధించింది..? అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ‘ఇలాంటి రోజులు చూడటానికేనా.. మేం పతకాలు సాధించింది. పోలీసులు దురుసుగా ప్రవర్తించడానికి మేమేమీ నేరస్తులం కాదు. ఘటనా స్థలంలో మహిళా పోలీసులు ఎందుకులేరు..? ఓ పోలీసు అధికారి తాగిన మత్తులో దుర్భాషలాడి, మాపై దాడి చేశాడు’ అంటూ వినేశ్ ఫోగట్ ఆరోపించారు.
కాగా, జంతర్‌మంతర్ (Jantar Mantar ) వద్ద నిరసన తెలుపుతున్న రెజ్లర్ల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎమ్మెల్యే సోమనాథ్ భారతి (MLA Somnath Bharti) బుధవారం రాత్రి మడత మంచాలు తీసుకొచ్చారు. అయితే వారికి వాటిని ఇచ్చేందుకు పోలీసులు అనుమతించలేదు. అనప్పటికీ వారు ట్రక్కు నుంచి మంచాలు, పరుపులను బయటకు తీయడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో రెజ్లర్లు, ఎమ్మెల్యే అనుచరులు.. పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో రెజ్లర్లు బజరంగ్ పునియా (Bajrang Punia), వినేశ్ ఫొగట్ (Vinesh Phogat)తోపాటు పలువురికి తలపై గాయాలయ్యాయి.
#WATCH | "We're in need of the support of the whole country, everyone must come to Delhi. Police using force against us, abusing women and doing nothing against Brijbhushan…": Wrestler Bajrang Punia pic.twitter.com/krGrO7HlxM
— ANI (@ANI) May 3, 2023
#WATCH | Delhi: A scuffle breaks out between protesting wrestlers and Delhi Police at Jantar Mantar pic.twitter.com/gzPJiPYuUU
— ANI (@ANI) May 3, 2023
Also Read..
CM KCR | ఢిల్లీ బయలుదేరిన సీఎం కేసీఆర్.. బీఆర్ఎస్ ఆఫీసును ప్రారంభించనున్న ముఖ్యమంత్రి
Inter board | ఇంటర్ బోర్డ్ గుడ్‌న్యూస్.. 500 ఫీజు కడితే హాజరు నుంచి మినహాయింపు