Shreyas Iyer : స్వదేశంలో న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు వైస్ కెప్టెన్‌గా ఎంపికైన శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer) మైదానంలోకి దిగనున్నాడు. అది కూడా కెప్టెన్‌గా. ఈమధ్యే కోలుకున్న అయ్యర్ దేశవాళీ క్రికెట్లో ఢిల్లీ సారథిగా ఎంపికయ్యా. వన్డే ఫార్మాట్లో జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీ (Vijay Hazare Trophy)లో తదుపరి మ్యాచ్‌లకు అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని సోమవారం ముంబై క్రికెట్ సంఘం తెలిపింది.
సిడ్నీ వన్డేలో గాయంతో ఆటకు దూరమైన శ్రేయాస్ అయ్యర్.. సర్జరీ తర్వాత వేగంగా కోలుకున్నాడు. ఇటీవలే బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఫిట్నెస్ చాటుకొని న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు ఎంపికయ్యాడు. అయితే.. బీసీసీఐ నిబంధనల ప్రకారం ఫిట్నెస్ చాటుకుంటేనే జాతీయ జట్టుకు ఆడే అవకాశం ఉన్నందున దేశవాళీ టోర్నీలో ఆడేందుకు సిద్ధమయ్యాడీ స్టార్ బ్యాటర్. సీనియర్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ (Shardhul Thakur) గాయపడడంతో అయ్యర్‌కు ముంబై సారథ్యం అప్పగించింది.
🚨 JUST IN 🚨
Shreyas Iyer has been appointed captain of the Mumbai team for the #VijayHazareTrophy.
He takes over the reins from Shardul Thakur, who has been ruled out of the domestic 50-over tournament due to injury. pic.twitter.com/KBBndn4dGm
— Cricbuzz (@cricbuzz) January 5, 2026
‘ముంబై సీనియర్ టీమ్ కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్ నియమితులయ్యాడనే విషయాన్ని మీతో పంచుకోవడం సంతోషంగా ఉంది. విజయ్ హజారే ట్రోఫీలో ముంబై అయ్యర్ సారథ్యంలోనే తదుపరి మ్యాచ్‌లు ఆడనుంది’ అని ఎంసీఏ ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుతం గ్రూప్ సీ నుంచి రెండో స్థానంలో ఉంది. జనవరి 6న హిమాచల్ ప్రదేశ్‌తో, జనవరి 8న పంజాబ్‌తో ముంబై తలపడనుంది.
రెండేళ్ల క్రితం వన్డే ప్రపంచకప్‌లో, ఆపై ఛాంపియన్స్ ట్రోఫీలో మెరిసిన అయ్యర్‌ను న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు తీసుకున్నారు. రెగ్యులర్ సారథి శుభ్‌మన్ గిల్ (Shubman Gill) నేతృత్వంలో 15 మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేయగా.. అయ్యర్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. జనవరి 11న బరోడాలో జరుగనున్న తొలి వన్డేలో కివీస్‌తో టీమిండియా తలపడనుంది.
🚨 News 🚨
India’s squad for @IDFCFIRSTBank ODI series against New Zealand announced.
Details ▶️ https://t.co/Qpn22XBAPq#TeamIndia | #INDvNZ pic.twitter.com/8Qp2WXPS5P
— BCCI (@BCCI) January 3, 2026
భారత వన్డే స్క్వాడ్ : శుభ్‌మన్ గిల్(కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, యశస్వీ జైస్వాల్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్(వైస్ కెప్టెన్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, సిరాజ్, హర్షిత్ రానా, ప్రసిధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, నితీశ్ రెడ్డి, అర్ష్‌దీప్ సింగ్.