CM KCR | ఢిల్లీ బయలుదేరిన సీఎం కేసీఆర్.. బీఆర్ఎస్ ఆఫీసును ప్రారంభించనున్న ముఖ్యమంత్రి
జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే దిశగా ఉరకలేస్తున్న బీఆర్ఎస్ (BRS) పార్టీ కేంద్ర కార్యాలయాన్ని సగ్వరంగా ప్రారంభించుకుంటున్నది. దేశ రాజధాని ఢిల్లీలోని వసంత్ విహార్‌లో (Vasant vihar) నిర్మించిన బీఆర్ఎస్ జాతీయ కార్యాలయాన్ని పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు (CM KCR) ప్రారంభించనున్నారు.
హైదరాబాద్: జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే దిశగా ఉరకలేస్తున్న బీఆర్ఎస్ (BRS) పార్టీ కేంద్ర కార్యాలయాన్ని సగ్వరంగా ప్రారంభించుకుంటున్నది. దేశ రాజధాని ఢిల్లీలోని వసంత్ విహార్‌లో (Vasant vihar) నిర్మించిన బీఆర్ఎస్ జాతీయ కార్యాలయాన్ని పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు (CM KCR) ప్రారంభించనున్నారు. ఇందులోభాగంగా సీఎం కేసీఆర్ ఢిల్లీ బయలుదేరారు. బేగంపేటలోని ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పయణమయ్యారు. మధ్యాహ్నం 1:05 గంటలకు బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును ప్రారంభిస్తారు. అంతకుముందు ఆయన మధ్యాహ్నం 12:30 గంటలకు ఏర్పాటుచేసిన యాగశాల, సుదర్శనపూజ, హోమం, వాస్తుపూజల్లో పాల్గొంటారు. ముహూర్తానికి కార్యాలయాన్ని ప్రారంభించిన తరువాత మొదటి అంతస్థులోని తన చాంబర్‌కు చేరుకుంటారు. అనంతరం పార్టీ సమావేశపు హాలులో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలతో దాదాపు గంటసేపు తొలి సమావేశం నిర్వహించనున్నారు.
కాగా, ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని నిర్మించాలని కేసీఆర్ 2004లోనే ఆలోచించారు. నాటి ప్రధాని మన్మోహన్సింగ్ ప్రాంతీయ పార్టీలకు స్థలాలను కేటాయించారు. ప్రాంతీయ పార్టీలకు ఢిల్లీలో స్థలాలను కేటాయించాలంటే ఆ పార్టీకి కనీసం ఐదుగురు ఎంపీలు ఉండాలి. ఐదుగురు ఎంపీలు ఉంటే 500 చదరపు గజాలు, 15 మందికి పైగా ఎంపీలు ఉన్న పార్టీకి 1,000 గజాల స్థలాన్ని కేటాయిస్తారు. బీఆర్ఎస్కు 2004లో ఐదుగురు ఎంపీలు మాత్రమే ఉండటంతో కేసీఆర్ ఆ సమయంలో కార్యాలయం కోసం స్థలం ఎంపికను వాయిదావేశారు. పార్టీకి ప్రస్తుతం 16 మంది ఎంపీలు ఉన్నారు. వెయ్యి గజాల స్థలం కేటాయించడానికి నిబంధనలు అంగీకరిస్తాయి. ఈ నేపథ్యంలో పార్టీ ఎంపీలు స్థలాలను పరిశీలించిన అనంతరం వసంత్‌విహార్‌లో ఎంపిక చేశారు. టీఆర్ఎస్గా పార్టీ కార్యాలయానికి భూమిపూజ నిర్వహించుకోగా బీఆర్ఎస్గా కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం విశేషం. భూమిపూజ జరిగిన 29 నెలల్లోనే కార్యాలయ నిర్మాణం పూర్తవ్వడం మరో విశేషం.
బీఆర్ఎస్ కార్యాలయ ప్రత్యేకతలు
- నాలుగు అంతస్థులతో 11 వేల చదరపు అడుగుల స్థలంలో బీఆర్‌ఎస్‌భవన్ నిర్మాణం.
- లోయర్‌గ్రౌండ్‌లో మీడియా హాల్, సర్వెంట్ క్వార్టర్స్.
- గ్రౌండ్‌ఫ్లోర్‌లో క్యాంటీన్, రిసెప్షన్ లాబీ, 4 ప్రధాన కార్యదర్శుల చాంబర్లు.
- మొదటి అంతస్థులో బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ చాంబర్, ఇతర చాంబర్స్, కాన్ఫరెన్స్ హాల్స్.
- 2వ, 3వ అంతస్థుల్లో మొత్తం 20 గదులు. వీటిలో పార్టీ ప్రెసిడెంట్ సూట్, వర్కింగ్ ప్రెసిడెంట్ సూట్‌పోగా మిగతా 18 ఇతర రూములు అందుబాటులో ఉంటాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

