బెంగళూరు: వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆగి ఉన్న లారీ వెనుక వైపు బలంగా ఢీకొట్టింది. (KSRTC bus rams parked lorry) ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు మరణించారు. ఇద్దరు పిల్లలతో సహా మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కేఎస్ఆర్టీసీకి చెందిన బస్సు బాగల్కోట్ నుంచి మంగళూరు వైపు వెళ్తున్నది. శుక్రవారం రాత్రి యల్లాపూర్లోని మావల్లి క్రాస్ వద్ద ఆగి ఉన్న లారీ వెనుక భాగాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో బస్సు ముందు భాగం కొంత ధ్వంసమైంది.
కాగా, ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు మరణించారు. ఇద్దరు పిల్లలతో సహా ఏడుగురు గాయపడ్డారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఇద్దరు మృతులను బాగల్కోట్కు చెందిన 40 ఏళ్ల నీలవ్వ హరదొల్లి, జాలిహాల్ గ్రామానికి చెందిన 30 ఏళ్ల గిరిజవ్వ బుదన్నవర్గా గుర్తించారు. 45 ఏళ్ల మరో మృతుడ్ని ఇంకా గుర్తించలేదు. పోస్ట్మార్టం కోసం మృతదేహాలను యల్లాపూర్ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
మరోవైపు గాయపడిన ఏడుగురిలో 7, 12 ఏళ్ల వయస్సున్న ఇద్దరు పిల్లల పరిస్థితి విషమంగా ఉన్నదని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను హుబ్బళ్లిలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. బస్సు డ్రైవర్, కండక్టర్ స్వల్పంగా గాయపడినట్లు వివరించారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ యమనప్పపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Man Tied To Pole Thrashed | వ్యక్తిని స్తంభానికి కట్టేసి కొట్టి.. రాత్రంతా అలాగే ఉంచిన అత్తమామలు
Watch: ఒకేచోట జాతీయ జంతువు పులి, జాతీయ పక్షి నెమలి.. అరుదైన వీడియో వైరల్