భువనేశ్వర్: అల్లున్ని అతడి అత్తమామలు స్తంభానికి కట్టేసి కొట్టారు. (Man Tied To Pole Thrashed) రాత్రంతా అతడ్ని అలాగే కట్టేసి ఉంచారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు మరునాడు ఉదయం అక్కడకు చేరుకున్నారు. కట్లు విప్పి అతడ్ని విడించారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఒడిశాలోని గజపతి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జలాంత బలియార్సింగ్ అనే వ్యక్తి ఏడాది కిందట భార్య సుభద్ర మాల్బిసోయేను కొట్టాడు. ఇది తెలిసి గ్రామ పెద్దలు అతడ్ని పిలిపించారు. అతడి భార్యను కొన్ని నెలలపాటు పుట్టింట్లో ఉండాలని సూచించారు. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ గృహ హింస కేసుపై ఏడాదిగా కోర్టులో విచారణ కొనసాగుతున్నది.
కాగా, ఆగస్ట్ 14న రాత్రి వేళ జలాంత బలియార్సింగ్ కిరాణా సరుకులు కొనేందుకు తన అత్తమామలు నివసించే గ్రామానికి వెళ్లాడు. అక్కడ వారు కనిపించడంతో తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో అత్తింటి వారు అతడ్ని ఒక స్తంభానికి కట్టేసి కొట్టారు. ఆ రాత్రంతా అతడ్ని అలాగే కట్టి ఉంచారు.
మరోవైపు మరునాడు ఉదయం ఇది చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు అక్కడకు చేరుకున్నారు. రాత్రంతా స్తంభానికి కట్టేసిన బలియార్సింగ్ను విడిపించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
Watch: అసెంబ్లీ ప్రాంగణంలోని మంత్రి కారును.. క్రేన్‌తో లాక్కెళ్లిన పోలీసులు
Watch: ఒకేచోట జాతీయ జంతువు పులి, జాతీయ పక్షి నెమలి.. అరుదైన వీడియో వైరల్