లక్నో: ఒక మంత్రి తన కారులో అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. అయితే నో పార్కింగ్ జోన్లో ఆ కారును పార్క్ చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి కారును క్రేన్ సహాయంతో పోలీసులు లాక్కెళ్లారు. (Minister’s car towed) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది. నిషాద్ పార్టీ జాతీయ అధ్యక్షుడు సంజయ్ నిషాద్ అధికార బీజేపీ ప్రభుత్వంలో మత్స్యశాఖ మంత్రి. గురువారం ఆయనకు చెందిన తెల్లటి టయోటా ఫార్చ్యూనర్‌లో అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు.
కాగా, మంత్రి సంజయ్ నిషాద్ కారును అసెంబ్లీలో ప్రాంగణంలోని నో పార్కింగ్ జోన్లో డ్రైవర్ పార్క్ చేశాడు. దీంతో ఇతర వాహనాలు వెళ్లలేకపోవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో పోలీసులు స్పందించారు. వెంటనే క్రేన్‌ను అక్కడికి రప్పించారు. మంత్రి సంజయ్ నిషాద్ కారును అసెంబ్లీ ప్రాంగణం నుంచి లాక్కెళ్లారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
यूपी विधान सभा परिसर में बेतरकीब तरीके से खड़ी मंत्री के गाड़ी को क्रेन से उठाया गया।@UPVidhansabha #Buldozer pic.twitter.com/l5baP1BGmF
— Jaya Singh. (@SinghJaya_) August 14, 2025
Also Read:
BJP MLAs Clash | అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ.. వీడియో వైరల్
Nurse Found Dead | నర్సింగ్ హోమ్‌లో నర్సు మృతి.. అత్యాచారానికి పాల్పడి హత్య చేసినట్లు కుటుంబం ఆరోపణ