కోల్‌కతా: నర్సింగ్ హోమ్‌లో పనిచేస్తున్న నర్సు అనుమానాస్పదంగా మరణించింది. (Nurse Found Dead) ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆ హాస్పిటల్ యాజమాన్యం తెలిపింది. అయితే ఆమెపై అత్యాచారానికి పాల్పడి హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సింగూర్‌లోని నర్సింగ్ హోమ్‌లో 24 ఏళ్ల మహిళ నర్సుగా పని చేస్తున్నది. గురువారం ఉదయం హాస్పిటల్ మూడో అంతస్తులోని గదిలో సీలింగ్‌కు వేలాడుతున్న ఆమె మృతదేహాన్ని గుర్తించారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. నర్సు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత నర్సు మరణానికి కారణం తెలుస్తుందని పోలీస్ అధికారి తెలిపారు.
కాగా, పుర్బా మెదినిపూర్ జిల్లాలోని నందిగ్రామ్‌కు చెందిన ఆ నర్సు నాలుగు రోజుల కిందటే ఆ ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌లో చేరినట్లు ఆమె కుటుంబం తెలిపింది. ఆ హాస్పిటల్లో నిర్వహించే ఆపరేషన్లలో జరుగుతున్న అవకతవకలను బయటపెట్టడంతో ఆమెపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
మరోవైపు నర్సింగ్ హోమ్ యాజమాన్యం ఈ ఆరోపణలను ఖండించింది. ఆ నర్సు ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొంది. కాగా, బెంగాల్లో ప్రతిపక్షమైన బీజేపీ, సీపీఎం పార్టీలు ఈ సంఘటనపై నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. నర్సు మృతిపై అనుమానం వ్యక్తం చేశాయి. పారదర్శకంగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశాయి.
Also Read:
Watch: పిజ్జా షాపులో ప్రియుడితో ఉన్న సోదరి.. ఆమె సోదరుడు ఏం చేశాడంటే?
Watch: ఏసీ కోచ్‌లో కూలింగ్ లేదని ప్రయాణికుడు ఫిర్యాదు.. తర్వాత ఏం జరిగిందంటే?
BJP MLAs Clash | అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ.. వీడియో వైరల్