పాట్నా: బీహార్‌కు చెందిన ఒక వ్యక్తి (Bihar Man) చనిపోయినట్లు ఎన్నికల అధికారి నిర్ధారించారు. ఓటరు జాబితా నుంచి ఆయన పేరు తొలగించారు. అయితే తాను బతికే ఉన్నానంటూ ఆ వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు అలాగే ఎలక్షన్ కమిషన్ (ఈసీ)కు మొరపెట్టుకున్నాడు. భోజ్‌పూర్ జిల్లా అర్రా అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన మింటూ కుమార్ పాస్వాన్ మరణించినట్లు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)లో బూత్ స్థాయి ఎన్నికల అధికారి నిర్ధారించారు. ముసాయిదా ఓటరు జాబితా నుంచి ఆయన పేరు తొలగించారు.
కాగా, బీహార్‌లో ఓటరు జాబితా సవరణ కోసం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియలో లక్షలాది మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించడంపై ఆ రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఓటరు జాబితా నుంచి పేరు తొలగించిన మింటూ కుమార్ పాస్వాన్ సహా పలువురిని న్యాయమూర్తి ముందు హాజరుపర్చారు.
మరోవైపు కోర్టుకు హాజరైన తర్వాత మింటూ కుమార్ పాస్వాన్ స్థానిక ఎమ్మెల్యేతో కలిసి బీహార్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ (సీఈవో) కార్యాలయానికి చేరుకున్నాడు. ఓటరు ముసాయిదా జాబితాలో తాను చనిపోయినట్లు ఎన్నికల అధికారి నిర్ధారించడంపై ఆవేదన వ్యక్తం చేశాడు. తాను బతికే ఉన్నానంటూ సంబంధిత పత్రాలను చూపించాడు. బూత్ స్థాయి ఎన్నికల అధికారి తన ఇంటికి రాకుండానే ఓటరు జాబితా నుంచి తన పేరు తొలగించినట్లు ఆరోపించాడు. ‘దీని వల్ల నాకు భారీ నష్టం జరుగుతుంది. నేను బంగ్లాదేశ్ పౌరుడినని రేపు వారు అంటారు’ అని వాపోయాడు. అధికారుల సూచన మేరకు ఓటరు జాబితాలో కొత్తగా పేరు నమోదు కోసం ఫారాన్ని పూర్తి చేసినట్లు వెల్లడించాడు.
VIDEO | Patna: Mintu Kumar Paswan reaches Election Commission with documents, as he was declared dead in the voters’ draft list.
He says, “I went to Supreme Court, because I was declared dead in the voters’ list. The judge spoke in English, and I do not understand that… I have… pic.twitter.com/54rXwIhA88
— Press Trust of India (@PTI_News) August 14, 2025
Also Read:
BJP MLAs Clash | అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ.. వీడియో వైరల్
Woman Gang-Raped At Friend’s Party | స్నేహితురాలి ఇంట్లో పార్టీ.. మహిళపై సామూహిక అత్యాచారం