న్యూఢిల్లీ: జాతీయ జంతువు పులి, జాతీయ పక్షి నెమలి ఒకేచోట చాలా ఠీవీగా, దగ్గరగా నడిచాయి. (Tiger, peacock walking) స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అరుదైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. శుక్రవారం దేశవ్యాప్తంగా 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ నేపథ్యంలో ఐఎఫ్ఎస్ అధికారి, అటవీ శాఖ ముఖ్య సంరక్షకుడు డాక్టర్ పీఎం ధకతే ఎక్స్‌లో ఒక వీడియో క్లిప్ పోస్ట్ చేశారు. ప్రకృతి శాస్త్రవేత్త రాకేష్ భట్ రికార్డ్ చేసిన వీడియోను ఆయన షేర్ చేశారు. ‘ఒక అద్భుతమైన వీడియో. మన జాతీయ జంతువు పులి, జాతీయ పక్షి నెమలి ఒకే ఫ్రేమ్‌లో కలిసి ఉన్నాయి. చాలా ఠీవీగా నడిచి వెళ్తున్నాయి. ఉత్సాహభరితమైన భారత స్ఫూర్తికి పరిపూర్ణ చిహ్నం. అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్’ అని పేర్కొన్నారు.
కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు భిన్నంగా స్పందించారు. పులి, నెమలి కలిసి కనిపించడం చాలా అరుదని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. భారతదేశంలో వైవిధ్యం ఉన్నప్పటికీ జాతీయ సమగ్రత, వాస్తవిక జాతీయతకు ఇది నిదర్శనమని కొందరు కొనయాడారు.
An amazing video, our national animal and bird, together in one frame! A perfect symbol of India’s vibrant spirit. Wishing everyone a Happy Independence Day.
आप सभी को स्वतंत्रता दिवस की हार्दिक बधाई एवं शुभकामनाएं, जय हिंद। 🇮🇳
VC: Rakesh Bhatt#IndependenceDay #JaiHind… pic.twitter.com/25UEfF7xxa— Dr. PM Dhakate (@paragenetics) August 15, 2025
Also Read:
BJP MLAs Clash | అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ.. వీడియో వైరల్
Watch: అసెంబ్లీ ప్రాంగణంలోని మంత్రి కారును.. క్రేన్‌తో లాక్కెళ్లిన పోలీసులు
Girl jumps from Court Building | కస్టడీ విధించడంతో.. కోర్టు బిల్డింగ్ పైనుంచి దూకిన బాలిక