చెన్నై: ఒక బాలికను కేర్ హోమ్ కస్టడీకి అప్పగించాలని కోర్డు ఆదేశించింది. కలత చెందిన ఆ బాలిక కోర్టు బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. (Girl jumps from Court Building) గాయపడిన ఆమెను హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ సంఘటన జరిగింది. భార్య మరో పెళ్లి చేసుకోవడంతో 15 ఏళ్ల కుమార్తెను తనకు అప్పగించాలని కోరుతూ ఒక వ్యక్తి మద్రాసు హైకోర్టును ఆశ్రయించాడు. హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు.
కాగా, బుధవారం ఈ కేసు విచారణ సందర్భంగా 15 ఏళ్ల బాలికను పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. అయితే తల్లిదండ్రులిద్దరితో కాకుండా అమ్మమ్మతో కలిసి జీవించాలన్న కోరికను ఆ బాలిక వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఆ బాలిక మానసిక పరిస్థితిని తెలుసుకునేందుకు కేర్ హోమ్‌లో ఉంచాలని హైకోర్టు ఆదేశించింది.
మరోవైపు కేర్ హోమ్ కస్టడీకి అప్పగించాలన్న కోర్టు ఆదేశంపై ఆ బాలిక కలత చెందింది. మద్రాసు హైకోర్టు మొదటి అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. అయితే పోలీసులు, కోర్టు సిబ్బంది ఆమెను రక్షించారు. గాయపడిన ఆ బాలికను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హైకోర్టు ఆవరణలో కలకం రేపిన ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
BJP MLAs Clash | అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ.. వీడియో వైరల్