జైపూర్: స్కూల్ ఆడిటోరియం స్లాబ్ పెచ్చులు ఊడిపడ్డాయి. (Portion Of Ceiling Falls) దీంతో స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థుల్లో ఐదుగురు గాయపడ్డారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. రాజస్థాన్‌లోని బుండీలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం సెయింట్ పాల్స్ సీనియర్ సెకండరీ స్కూల్ ఆడిటోరియంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి. సుమారు 350 మంది విద్యార్థులు, 250 మంది తల్లిదండ్రులు, 49 మంది సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కాగా, ఆ స్కూల్ ఆడిటోరియం స్లాబ్ నుంచి పెచ్చులు ఊడిపడ్డాయి. దీంతో ఐదుగురు విద్యార్థులు గాయపడ్డారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు విద్యార్థుల తల గాయాలకు కుట్లు వేశారు. ప్రాథమిక చికిత్స తర్వాత వారిని డిశ్చార్జ్ చేశారు.
మరోవైపు ఈ సమాచారం తెలిసిన వెంటనే జిల్లా విద్యాశాఖ అధికారి ఆ ప్రైవేట్ స్కూల్‌కు చేరుకున్నారు. స్లాబ్ పెచ్చులు ఊడి పడిన స్కూల్ ఆడిటోరియంను సీజ్ చేసినట్లు తెలిపారు. ఆ రాష్ట్ర విద్యా మంత్రి మదన్ దిలావర్ కూడా దీనిపై స్పందించారు. ఈ సంఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు.
Also Read:
Watch: అసెంబ్లీ ప్రాంగణంలోని మంత్రి కారును.. క్రేన్‌తో లాక్కెళ్లిన పోలీసులు
Nurse Found Dead | నర్సింగ్ హోమ్‌లో నర్సు మృతి.. అత్యాచారానికి పాల్పడి హత్య చేసినట్లు కుటుంబం ఆరోపణ