లక్నో: పోలీసుల నుంచి తప్పించుకునేందుకు క్యాబ్ డ్రైవర్ వేగంగా కారు నడిపాడు. (Cab Driver Sped Away) దీంతో ఆ కారులో ప్రయాణించిన భార్యాభర్తలు భయాందోళన చెందారు. కారు ఆపాలని కారు అభ్యర్థించారు. తమ కుమార్తె భయపడుతున్నదని, గాయపడుతుందని డ్రైవర్‌ను ప్రాధేయపడ్డారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దేశ రాజధాని ఢిల్లీ శివారు ప్రాంతమైన ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఈ సంఘటన జరిగింది. గురువారం గ్రేటర్ నోయిడా వెస్ట్ నుంచి కన్నాట్ ప్లేస్‌కు వెళ్లేందుకు భార్యాభర్తలు ఉబర్‌లో క్యాబ్ బుక్ చేశారు. వారు ప్రయాణించిన ఆ క్యాబ్‌ను ఆపేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రయత్నించారు.
కాగా, క్యాబ్ డ్రైవర్ ఆపలేదు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు వేగంగా కారును డ్రైవ్ చేశాడు. చాలా నిర్లక్ష్యంగా నడిపాడు. దీంతో ఆ క్యాబ్‌లోని భార్యాభర్తలు భయాందోళన చెందారు. కారు ఆపితే తాము దిగిపోతామంటూ ఆ డ్రైవర్‌ను అభ్యర్థించారు. అయితే తన వద్ద సరైన పత్రాలు లేవని, పోలీసులు తన కారును స్వాధీనం చేసుకుంటారని అతడు చెప్పాడు.
మరోవైపు కారును పోలీసులు వెంబడిస్తున్నారని, తప్పించుకోవడం కష్టమని ఆ దంపతులు తెలిపారు. పోలీసులు విధించే జరిమానా తాము చెల్లిస్తామని, కారు ఆపాలని ప్రాధేయపడ్డారు. తమ కుమార్తె భయపడుతున్నదని, గాయపడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కొంచెం స్లో చేస్తే దిగిపోతామని అభ్యర్థించారు. వారి కుమార్తె ఏడ్వడంతో చివరకు డ్రైవర్ కారు ఆపాడు. వారు దిగిన వెంటనే వేగంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
కాగా, భయానక అనుభవం ఎదుర్కొన్న ఆ వ్యక్తి మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసిన వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు వేగంగా డ్రైవ్ చేపిన ఆ క్యాబ్ డ్రైవర్ ఒక కారును కూడా ఢీకొట్టినట్లు తెలిపాడు. వైరల్ అయిన ఈ వీడియో క్లిప్ పోలీసుల దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలో ఆ క్యాబ్ డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. చలానా విధించడంతోపాటు అతడి కారును స్వాధీనం చేసుకున్నారు.
A horrible experience with @Uber @Uber_Support, today me and my family was en-route to CP from noida. Near to Parthala Bridge Noida a police intercepter vehicle asked the driver to stop the car but the driver didn’t stop and trying to escape from police vehicle.@noidapolice pic.twitter.com/RdftglUG5k
— Sanjay Mohan (@sanmohan4u) August 14, 2025
Also Read:
Watch: అసెంబ్లీ ప్రాంగణంలోని మంత్రి కారును.. క్రేన్‌తో లాక్కెళ్లిన పోలీసులు
BJP MLAs Clash | అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ.. వీడియో వైరల్
Nurse Found Dead | నర్సింగ్ హోమ్‌లో నర్సు మృతి.. అత్యాచారానికి పాల్పడి హత్య చేసినట్లు కుటుంబం ఆరోపణ