హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): సోషల్ మీడియాతో మహిళల భద్రతకు ముప్పు పొంచి ఉన్నదని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. శనివారం జేఎన్టీయూలో ‘స్టాండ్ విత్ హర్’ ప్రోగ్రామ్ను ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ మహిళల భద్రతా చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. సౌరవిద్యుత్ రంగంలో మహిళలను శక్తివంతులుగా చేశామని పేర్కొన్నారు.