జోగులాంబ గద్వాల జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉండవెల్లి మండలం ఇటిక్యాలపాడు స్టేజీ సమీపంలోని ఘర్ దాబా వద్ద ఓ లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది.
ప్రమాదానికి కారణమైన బస్సును ఇంటర్సిటీ స్మార్ట్ బస్సుగా గుర్తించారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాద తీవ్రత ఎక్కువగానే ఉన్నప్పటికీ.. బస్సులో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.