హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): రోజువారీ పనుల్లో మునిగిపోయి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ కమిషనర్ టీకే శ్రీదేవి సూచించారు. ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో ఎంఏయూడీ విభాగం ఆధ్వర్యంలో ఆ శాఖ కేంద్ర కార్యాలయంలో శనివారం మెగా హెల్త్ క్యాంపును ప్రారంభించారు. పుష్పగిరి ఐఫౌండేషన్, మల్లారెడ్డి, రోటరీ క్లబ్, కిమ్స్, అగర్వాల్స్ ఐ హాస్పిటల్స్ సంయుక్తంగా నిర్వహించిన శిబిరంలో సుమారు 260మంది వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వారిలో ఆరుగురికి క్యాన్సర్ లక్షణాలు ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు.