Kameng river | అది మంచి నీటితో ప్రవహించే నది ! కానీ ఒక్కసారిగా ఆ నది కళ తప్పింది. స్వచ్ఛమైన నీటితో ప్రవహించాల్సిన నది రూపం మారింది. అకస్మాత్తుగా ఆ నదిలోని నీరంతా నలుపు రంగులోకి మారిపోయింది. నీరు మొత్తం విషమయం కావడంతో ఆ నదిలో జీవిస్తున్న వేలాది చేపలు చనిపోయాయి. ఆ ఆశ్చర్యకరమైన ఘటన అరుణాచల్ ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఆ నది పేరు కామెంగ్ నది ( kameng river ). మరి ఈ నదిలోని నీరంతా విషమయం కావడానికి కారణమేంటో తెలుసా ! మన పొరుగు దేశమైన చైనా ( china ) !! అవును చైనాలో యథేచ్ఛగా భారీ నిర్మాణాలు చేపట్టడమే ఇందుకు కారణమని అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు.
Even after three days, there is no sign of improvement in Kameng River. Water continues to be muddied, flowing in huge quantities of fresh logs while fishes and aquatic lives washed to the bank. State govt constitutes fact finding committee. pic.twitter.com/XBNjpEm8Iz
— The Arunachal Times (@arunachaltimes_) October 31, 2021
సాధారణంగా నదిలో కరిగే వ్యర్థాల (టీడీఎస్) పరిమాణం సాధారణంగా లీటర్ నీటిలో 300 నుంచి 1200 మిల్లీ గ్రాముల వరకు ఉండాలి. కానీ కామెంగ్ నదిలో 6800 మిల్లీ గ్రాముల టీడీఎస్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీని వల్లే కామెంగ్ నదిలోని నీరు అకస్మాత్తుగా నల్లగా మారిందని.. దీనివల్ల ఆ నదిలో ఉన్న జలచరాలు శ్వాస పీల్చుకోవడం సాధ్యం కాక మరణించాయని పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
china | వీగర్ల అవయవాలతో చైనా వ్యాపారం
Akhundzada : తొలిసారి ప్రపంచం ముందుకొచ్చిన తాలిబాన్ అగ్రనేత అఖుంద్జాదా
Ajay Mishra | కేంద్రమంత్రి కాన్వాయ్‌పైకి గుడ్లు విసిరిన ఎన్ఎస్యూ కార్యకర్తలు
Narayana Swamy : ఏపీ డిప్యూటీ సీఎంకు ఊహించని షాక్