Ajay Mishra | కేంద్రమంత్రి కాన్వాయ్‌పైకి గుడ్లు విసిరిన ఎన్ఎస్యూ కార్యకర్తలు
Odisha Congress activists hurl eggs at Union minister Ajay Mishra’s convoy | కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాకు ఒడిశా పర్యటనలో చేదు అనుభవం ఎదురైంది. ఆదివారం భువనేశ్వర్‌లోని

భువనేశ్వర్ : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాకు ఒడిశా పర్యటనలో చేదు అనుభవం ఎదురైంది. ఆదివారం భువనేశ్వర్‌లోని బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల ఆయన కాన్వాయ్‌పైకి ఎన్ఎస్యూఐ కార్యకర్తలు కోడిగుడ్లు విసిరారు. కేంద్రమంత్రి పర్యటన సందర్భంగా భారీగా బలగాలను మోహరించారు.
వారిని తప్పించుకొని కాంగ్రెస్ విద్యార్థి విభాగం నేతలు కాన్వాయ్‌పై గుడ్లు విసిరారు. కటక్‌లోని ముండులిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన ఒడిశాకు రాగా.. మంత్రికి వ్యతిరేకంగా ఎన్‌యూఎస్‌యూ నేతలు నల్లజెండాలను ప్రదర్శించగా.. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అక్టోబర్ 3న ఉత్తర్‌ప్రదేశ్ అఖింపూర్ ఖేరిలో చెలరేగిన హింసాకాండ నేపథ్యంలో.. మంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రాను 9న పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
మంత్రి కాన్వాయ్‌లోని ఓ వాహనం వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారిపైకి దూసుకెళ్లగా.. నలుగురు రైతులు సహా ఎనిమిది మంది మృతి చెందారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మంత్రి, ఆయన కుమారుడిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

