ISS | రాత్రి వేళల్లో ప్రకాశవంతంగా వెలుగులీనే ప్రపంచంలోని ప్రధాన నగరాలకు చెందిన ఫొటోలను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) తాజాగా విడుదల చేసింది. ఆ ఫొటోల్లో మన దేశ రాజధాని ఢిల్లీ (Delhi) కాంతులీనుతూ అద్భుతంగా, ఆకర్షణీయంగా కనిపించింది.
ఐఎస్ఎస్.. ప్రపంచంలోనే అందమైన నగరాలైన టోక్యో (Tokyo), సింగపుర్ (Singapore) వంటి ప్రముఖ నగరాల ఫొటోలను రిలీజ్ చేసింది. ఆ నగరాలు రాత్రిపూట (night images) కాంతులీనుతూ ఎంతో అందంగా కనిపించాయి. వాటితో సమానంగా ఢిల్లీ కూడా ఆకర్షణీయంగా కనిపించడం విశేషం. ఈ ఫొటోలో ఢిల్లీ ఎయిర్పోర్ట్ కూడా కనిపించింది. రాత్రి 10.54 గంటల సమయంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ దృశ్యాలను చిత్రీకరించినట్లు ఐఎస్ఎస్ వెల్లడించింది. ఐఎస్ఎస్ నుంచి కనిపించే అత్యంత ప్రకాశవంతమైన పట్టణాల్లో సింగపూర్, టోక్యో, సావోపాతోపాటూ ఢిల్లీ నగరం కూడా ఉన్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతున్నాయి.
Cities like Delhi, Singapore, Tokyo, and São Paulo are among the most luminous urban centers seen from the International Space Station at night. pic.twitter.com/JAfqr4PPTs
— International Space Station (@Space_Station) November 20, 2025
Also Read..
Earthquake | బంగ్లాదేశ్‌లో భారీ భూకంపం.. టెస్ట్ మ్యాచ్‌కు అంతరాయం.. భారత్‌లోనూ ప్రకంపనలు
Miss Universe 2025 | ఈ ఏడాది మిస్ యూనివర్స్‌గా ఫాతిమా బోష్.. పోటీలో భారత్‌కు తీవ్ర నిరాశ