Earthquake | పొరుగుదేశం బంగ్లాదేశ్ (Bangladesh)లో భారీ భూకంపం (Earthquake) సంభవించింది. రాజధాని ఢాకా (Dhaka)లో శుక్రవారం ఉదయం 10:08 గంటల సమయంలో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. రిక్టరుస్కేలుపై భూకంపం తీవ్రత 5.5గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే (US Geological Survey) తెలిపింది.
ఢాకాకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న నర్సింగ్డిలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు పేర్కొంది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు వెల్లడించింది. ఈ భూకంపం బంగ్లాదేశ్-ఐర్లాండ్ మధ్య ఢాకా వేదికగా జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. ప్రకంపనలతో కొన్ని నిమిషాల పాటూ మ్యాచ్ ఆగిపోయింది. ఆ తర్వాత కొనసాగించారు. అయితే, ఈ విపత్తులో ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం లేదు.
మరోవైపు ఈ ప్రకంపనల ధాటికి భారత్‌లోనూ భూమి కంపించింది. కోల్‌కతా (Kolkata) సహా ఉత్తర భారతంలో (Northeast India) ప్రకంపనలు నమోదయ్యాయి. కోల్‌కతాలో ఉదయం 10:10 గంటల సమయంలో కొన్ని సెకన్ల పాటూ భూమి కంపించింది. బెంగాల్‌లోని కూచ్‌బెహార్, దక్షిణ్, ఉత్తర దినాజ్‌పూర్ సహా పలు ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయి. గువాహటి, అగర్తల, షిల్లాంట్ వంటి నగరాల్లోనూ భూమి కంపించింది. ఈ భూ ప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా ఇళ్ల నుంచి బయటకు పరుగులుతీశారు.
Also Read..
Donald Trump | రొనాల్డోతో ట్రంప్ ఫుట్‌బాల్.. వీడియో షేర్ చేసిన అధ్యక్షుడు
Miss Universe 2025 | ఈ ఏడాది మిస్ యూనివర్స్‌గా ఫాతిమా బోష్.. పోటీలో భారత్‌కు తీవ్ర నిరాశ