Donald Trump | ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo)తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఫుట్‌బాల్ (Football) ఆడితే ఎలా ఉంటుంది..? చూడటానికి రెండు కళ్లూ చాలవు. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
రొనాల్డోతో కలిసి వైట్‌హౌస్‌లో (White House) ఫుట్‌బాల్ ఆడుతున్నట్లు ఏఐతో రూపొందించిన వీడియోను (AI Video) అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోలో ట్రంప్, రొనాల్డో ఇద్దరూ వైట్‌హౌస్‌లోని ఓవల్ ఆఫీసులో బంతితో విన్యాసాలు చేస్తూ కనిపించారు. ఈ వీడియో షేర్ చేసిన ట్రంప్.. రొనాల్డోపై ప్రశంసలు కురిపించారు. రొనాల్డో ఓ గొప్ప వ్యక్తి అని.. వైట్‌హౌస్‌లో అతడిని కలవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
ఇటీవలే సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ (Saudi Prince) మహమ్మద్ బిన్ సల్మాన్ (Mohammed bin Salman) దాదాపు ఏడేళ్ల తర్వాత అమెరికాలో పర్యటించిన విషయం తెలిసిందే. అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump)తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సౌదీ క్రౌన్ ప్రిన్స్‌కు ట్రంప్ ప్రత్యేక విందు ఇచ్చారు. వైట్‌హౌస్‌లో ఇచ్చిన ఈ విందుకు టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్, ఫుట్‌బాల్ దిగ్గజం రొనాల్డో సహా పలువురు హాజరయ్యారు. ఈ సందర్భంగా రొనాల్డోతో ట్రంప్ సరదాగా ముచ్చటించారు.
Also Read..
Miss Universe 2025 | ఈ ఏడాది మిస్ యూనివర్స్‌గా ఫాతిమా బోష్.. పోటీలో భారత్‌కు తీవ్ర నిరాశ
ఎప్స్టీన్ ఫైల్స్ విడుదలకు ట్రంప్ ఆమోదం