వాషింగ్టన్ : సెక్స్ ట్రాఫికర్ జెఫ్రీ ఎప్స్టీన్కు సంబంధించిన అన్ని ఫైళ్లను బహిర్గతం చేయడానికి సంబంధించిన బిల్లుపై సంతకం చేశానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం తెలిపారు. ఇది పారదర్శకత కోసం వేసిన గొప్ప ముందడుగు అని చెప్పారు.
ట్రంప్ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ.. ఎప్స్టీన్తో సంబంధాలున్న డెమొక్రాట్లపై విమర్శలు గుప్పించారు. మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, మాజీ ట్రెజరీ సెక్రటరీ లారీ సమ్మర్స్, లింక్డ్ఇన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హోఫ్మన్ పేర్లను ప్రస్తావించారు.