Miss Universe 2025 | ఈ ఏడాది మిస్ యూనివర్స్‌గా (Miss Universe 2025) మెక్సికో (Mexico) భామ ఫాతిమా బోష్ (Fatima Bosch) నిలిచారు. థాయ్‌లాండ్ వేదికగా జరిగిన విశ్వ సుందరి పోటీల్లో ఫాతిమా విజేతగా నిలిచారు. దీంతో గతేడాది మిస్ యూనివర్స్‌గా నిలిచిన డెన్మార్క్ భామ విక్టోరియా కెజార్ హెల్విగ్.. ఫాతిమాకు మిస్ యూనివర్స్ కిరీటాన్ని అలంకరించారు. పోటీల్లో తొలి రన్నరప్‌గా థాయ్‌లాండ్‌కు చెందిన ప్రవీనర్ సింగ్, రెండో రన్నరప్‌గా వెనెజువెలాకు చెందిన స్టిఫానీ అబాసలీ నిలిచారు.
కాగా, మిస్ యూనివర్స్ 2025లో భారత్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. ఈ పోటీల్లో భారత్ తరఫున రాజస్థాన్‌కు చెందిన మణిక విశ్వకర్మ (Manika Vishwakarma) పోటీల్లో పాల్గొన్నారు. ఎంతో ఉత్సాహంగా పోటీల్లో పాల్గొన్న మణిక టాప్ 30 వరకూ రాగలిగింది. ఆ తర్వాత న్యాయనిర్ణేతలను ఆకట్టుకోవడంలో విఫలమైంది. టాప్ 12లో స్థానం సంపాదించలేకపోయింది. దీంతో భారత్‌కు ఈ ఏడాది మిస్ యూనివర్స్ కిరీటం చేజారింది. కాగా, జైపుర్‌లో ఈ ఏడాది ఆగస్టులో జరిగిన మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని సొంతం చేసుకున్న మణిక మిస్ యూనివర్స్‌కు భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించేందుకు అర్హత సాధించారు.
Also Read..