Karnataka Congress | కర్ణాటకలో (Karnataka) కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు పూర్తయిన వేళ పార్టీలో సంక్షోభం మరింత ముదిరింది. సీఎం కుర్చీ కోసం కుమ్ములాటలు తీవ్రమయ్యాయి. ముఖ్యమంత్రి మార్పు లొల్లి తాజాగా దేశరాజధాని ఢిల్లీకి చేరింది.
ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న డీకే శివకుమార్ (DK Shivakumar) వర్గానికి చెందిన ఓ మంత్రి సహా పది మంది ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లారు. నాయకత్వ మార్పు కోసం అధిష్ఠానంపై ఒత్తిడి పెంచుతున్నారు. సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా రెండున్నరేండ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో మిగతా రెండున్నరేళ్లు తమ నాయకుడిని సీఎంని చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నేడు వారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌ను కలిసేందుకు సిద్ధమయ్యారు. 2023లో అంగీకరించిన అంతర్గత అధికార భాగస్వామ్య ఒప్పందాన్ని అమలు చేసే అంశంపై ఒత్తిడి తేనున్నట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి.
Also Read..
28న ఛత్తీస్‌గఢ్‌లో డీజీపీల మీటింగ్.. హాజరుకానున్న మోదీ, అమిత్‌షా