Supreme Court | ఇండిగో సంక్షోభం (IndiGo crisis)పై అత్యవసర విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్‌ను దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) తిరస్కరించింది. ఇండిగో సంక్షోభంపై ప్రస్తుతానికి ఎలాంటి జోక్యం చేసుకోబోమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ (CJI Surya Kant) స్పష్టం చేశారు. ‘ఇండిగో విమానాల రద్దు తీవ్రమైన సమస్యే. లక్షలాది మంది ప్రయాణికుల అవస్థలను మేము అర్థం చేసుకున్నాము. అయితే, ఈ సమస్యపై ఇప్పటికే ప్రభుత్వం దృష్టి సారించింది. సకాలంలో చర్యలు తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఈ విషయంలో మాకు ఎలాంటి అత్యవసర పరిస్థితి కనిపించడం లేదు. ఇండిగో సంక్షోభంపై ప్రస్తుతానికి ఎలాంటి జోక్యం చేసుకోబోము’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు.
The Supreme Court has refused to entertain a plea seeking an urgent hearing in the matter regarding the recent cancellations and delays of commercial passenger flights by the airline company IndGo.
The plea was mentioned by an advocate who stated that around 2500 flights have… pic.twitter.com/Y4waGFEKK4
— ANI (@ANI) December 8, 2025
కాగా, గత ఆరు రోజులుగా ఇండిగో సంస్థ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న విషయం తెలిసిందే. రోజూ వందలాది విమానాలు రద్దు, ఆలస్యం అవుతున్నాయి. దీంతో లక్షలాది మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్టుల్లో దిక్కుతోచని స్థితితిలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిపై ఓ న్యాయవాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. దేశంలోని 95 విమానాశ్రయాల్లో సుమారు 2500 విమానాలు ఆలస్యం అయ్యాయని, దీన్ని వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పిటిషన్లో ప్రస్తావించారు. ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పందించాలని కోరారు. పరిస్థితి తీవ్రతను పరిగణనలోకి తీసుకొని దీనిపై తక్షణమే విచారణ జరిపేందుకు ప్రత్యేక బెంజ్‌ను ఏర్పాటు చేయాలని పిటిషనర్ కోరారు. స్టేటస్ రిపోర్ట్ సమర్పించేలా పౌరవిమానయాన మంత్రిత్వశాఖ, డీజీసీఏను ఆదేశించాలని అభ్యర్థించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం ఇందులో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది.
Also Read..
IndiGo | సంక్షోభం వేళ భారీగా పతనమైన ఇండిగో షేర్లు
IndiGo | ఏడో రోజూ ఇండిగో సంక్షోభం.. నేడు వందలాది విమానాలు రద్దు
Air India | కేంద్రం మార్గదర్శకాలు.. టికెట్ ధరలపై పరిమితి విధించిన ఎయిర్ ఇండియా