IndiGo | దేశీయ విమానయాన సంస్థ ఇండిగో (IndiGo) సంక్షోభం కొనసాగుతోంది. వరుసగా ఏడో రోజు సోమవారం కూడా దేశవ్యాప్తంగా వందలాది విమానాలు రద్దయ్యాయి. ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, కోల్‌కతా, జైపూర్, శ్రీనగర్ సహా పలు ఎయిర్‌పోర్టుల్లో విమానాలు రద్దయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Delhi | IndiGo cancels a total of 134 flights- 75 departures and 59 arrivals: IGI Airport
— ANI (@ANI) December 8, 2025
సోమవారం ఉదయం ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్టులో మొత్తం 134 విమానాలు రద్దయ్యాయి. అందులో 75 డిపార్చర్స్ కాగా, 59 అరైవల్స్ ఉన్నాయి. బెంగళూరులోని కంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో 127 (65 అరైవల్స్, 62 డిపార్చర్స్), హైదరాబాద్‌లో 77 (38 అరైవల్స్, 39 డిపార్చర్స్), చెన్నైలో 71, అహ్మదాబాద్‌లో 20, వైజాగ్‌లో ఏడు, ముంబై, కోల్‌కతా, శ్రీనగర్‌లోనూ పదుల సంఖ్యలో విమానాలు రద్దయ్యాయి. మొత్తంగా ఇవాళ ఉదయం 9:30 గంటల సమయానికి దేశ వ్యాప్తంగా 360 ఇండిగో విమానాలు క్యాన్సెల్ అయ్యాయి.
Karnataka | 65 arrivals and 62 departures have been cancelled by IndiGo. Next update to be shared after 6 pm: Kempegowda International Airport Authority Limited (KIAL)
— ANI (@ANI) December 8, 2025
ఆదివారం ఏకంగా 650 విమానాలు రద్దు చేయగా, మొత్తం 2,300 విమానాలకు 1,650 నడిపినట్టు ఆ ఇండిగో ఒక ప్రకటనలో తెలిపింది. డిసెంబర్ 10వ తేదీ నాటికి రాకపోకలను స్థిరీకరిస్తామని పేర్కొంది. విమానాల రాకపోకలను సాధారణ స్థితికి తేవడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని తెలిపింది. మరోవైపు రోజూ వందలాది విమానాల రద్దు, ఆలస్యంతో వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వేలాది మంది ఎయిర్‌పోర్టుల్లో పడిగాపులు కాయడం కన్పించింది. తమ విమానాలు ఎప్పుడు పునరుద్ధరిస్తారో తెలియక నిస్సహాయంగా ఎదురుచూస్తున్నారు. తాము వివరాలు అడిగినా ఇండిగో సిబ్బంది పూర్తి సమాచారం అందజేయడం లేదని, వారి స్పందన చూసి విసిగివేసారిపోయామని పలువురు ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు.
Also Read..
Goa Night Club | గోవా నైట్‌క్లబ్‌లో భారీ అగ్నిప్రమాదం.. వెలుగులోకి సంచలన వీడియో
Vande Mataram Debate | వందేమాతరంపై నేడు లోక్‌సభలో చర్చ