Vande Mataram Debate | ‘వందేమాతరం’ 150వ వార్షికోత్సవాలను పురస్కరించుకొని ఆ గేయంపై పార్లమెంట్లో నేడు చర్చ (Vande Mataram Debate) జరగనుంది. ఇవాళ ఉదయం 12 గంటలకు లోక్సభ (Lok Sabha)లో చర్చ ప్రారంభం కానుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఈ చర్చను ప్రారంభించనున్నారు. ఇందుకోసం 10 గంటల సమయం కేటాయించారు. మోదీ చర్చ ప్రారంభించిన అనంతరం.. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఇతర కేంద్ర మంత్రులు దీనిపై ప్రసంగిస్తారు. ప్రతిపక్ష ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ నేతలు గౌరవ్ గొగోయ్, ప్రియాంక గాంధీ వాద్రా ఈ చర్చలో పాల్గొననున్నారు.
ఇక రాజ్యసభలో వందేమాతరంపై రేపు చర్చ జరగనుంది. కేంద్ర హోం మంత్రి అమిత్షా ఈ చర్చను ప్రారంభింస్తారు. ఆ తర్వాత కేంద్ర మంత్రి జేపీ నడ్డా ప్రసంగించనున్నారు. ఇదిలా ఉండగా.. డిసెంబర్ 9న మంగళవారం ఉదయం 12 గంటల నుంచి సర్ అంశంపై లోక్సభలో చర్చ జరగనుంది. కాగా, డిసెంబర్ ఒకటిన మొదలైన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు 19వ తేదీ వరకు కొనసాగుతాయి. 15 రోజుల పాటు జరుగనున్నాయి.
Also Read..
ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడం క్రూరత్వమే
పంజాబ్ సీఎం పదవికి రూ.500 కోట్లు!