ముంబై, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): బాధితులకు న్యాయం అందించే ఓ కోర్ట్ ఆవరణలోనే ఓ మహిళపై అత్యాచారం జరగడం సంచలన సృష్టించింది. థానే ఫ్యామిలీ కోర్టు ఆవరణలోని ఓ కారులో వివాహితపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన షాకింగ్ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల ప్రకారం నిందితుడు కేదార్ ఉద్యోగం ఇప్పిస్తానని బాధితురాలిని నమ్మించాడు. ఆమె పుట్టిన రోజు కేక్‌లో మత్తుమందు కలిపి తినిపించాడు. ఆమె సృ్పహ కోల్పోయిన తర్వాత మరొకరితో కలిసి నిందితుడు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆగస్టు 25, 2024న జరిగిందని బాధితురాలు ఈ నెల 5న ఫిర్యాదు చేసింది. లైంగిక దాడిని వీడియో తీసిన నిందితులు దానిని చూపించి ఆమెను బెదిరించడం వల్లే బాధితురాలు ఆలస్యంగా ఫిర్యాదు చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు.