చండీగఢ్: పంజాబ్ పీసీసీ మాజీ చీఫ్ నవ్‌జోత్‌సింగ్ సిద్ధూను ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటిస్తే, ఆయన తిరిగి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటారని ఆయన సతీమణి, ఆ పార్టీ నేత నవ్‌జోత్ కౌర్ సిద్ధూ చెప్పారు. “మేం ఎల్లప్పుడూ పంజాబ్, పంజాబీదనం గురించి మాట్లాడతాం, కానీ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవడానికి రూ.500 కోట్లు ఇవ్వాలంటే, మా దగ్గర లేవు” అని ఆమె చెప్పారు.