Goa Night Club | గోవా నైట్ క్లబ్లో ప్రమాదానికి సంబంధించి సంచలన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ డ్యాన్సర్ ప్రదర్శన ఇస్తున్న సమయంలో వెనుక ఒక్కసారిగా మంటలు (Fire) చెలరేగాయి. కాసేపటికే మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. అనంతరం పెద్ద ఎత్తున పొగ కమ్మేసింది (Heavy Smoke). అప్రమత్తమైన సిబ్బంది వెంటనే అక్కడి నుంచి బయటకు వెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Most clear video of the Goa Fire Incident
Within 40 seconds the fire spread into wild fire
Now we will find all the loopholes, illegal permissions & corruption
After we lost precious lives
Terrible pic.twitter.com/LKlXNB4rHh
— Flt Lt Anoop Verma (Retd.) 🇮🇳 (@FltLtAnoopVerma) December 7, 2025
ఉత్తర గోవాలోని అర్పోరాలోని బిర్చ్ బై రోమియో లేన్ అనే నైట్‌క్లబ్‌లో శనివారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 25 మంది మరణించగా, ఆరుగురు గాయపడ్డారు. రాజధాని పనాజీకి 25 కి.మీ దూరంలో ఈ నైట్ క్లబ్ ఉన్నది. మృతి చెందిన వారిలో 14 మంది నైట్ క్లబ్ ఉద్యోగులు కాగా, నలుగురు టూరిస్ట్‌లు ఉన్నారు. మిగతా ఏడుగురిని గుర్తించాల్సి ఉంది. ఆరుగురు గాయపడ్డారు. అగ్నిమాపక భద్రతా నియమాలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా క్లబ్‌కు చెందిన నలుగురు సిబ్బందిని అరెస్ట్ చేశారు. యజమానులపై కూడా కేసు నమోదు చేశామని, వారిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
Also Read..
Goa Night Club | రెండే గేట్లు.. కలప ఫర్నీచర్ వల్లే మృతుల సంఖ్య పెరిగింది..!
Vande Mataram Debate | వందేమాతరంపై నేడు లోక్‌సభలో చర్చ