Goa Night Club : గోవాలోని ది బిర్చ్ బై రొమియో లేన్ (The Birch By Romeo Lane club) నైట్ క్లబ్లో జరిగిన ప్రమాదం గురించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రమాద తీవ్రతకు.. మృతుల సంఖ్య పెరగడానికి రెండు గేట్లు మాత్రమే ఉండడంతో పాటు కలప ఫర్నీచర్(Wood Furniture) ద్వారా మంటలు వ్యాపించడమే కారణమని పోలీసులు తెలిపారు. అయితే.. ముందుగా అనుకున్నట్టు సిలిండర్ పేలుడు ప్రమాదానికి కారణం కాదని పోలీసులు వెల్లడించారు.
శనివారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 23 మంది మృతదేహాలపై ఎలాంటి కాలిన గాయాలు లేవని.. కేవలం ఇద్దరి మృతదేహాలే బాగా కాలిపోయాయని పోలీసులు తెలిపారు. ఆక్సిజన్ కొరత, ఊపిరాడకపోవడం కారణంగానే వీరంతా మరణించారని పేర్కొన్నారు. 17 మృతదేహాలకు పోస్ట్మార్టం నిర్వహించామని.. ఇదివరకూ ఆరుగురి మృతదేహాలను అంత్యక్రియల కోసం వారి కుటుంబసభ్యులకు అప్పగించామని పోలీసులు వెల్లడించారు.
Video captures moment when fire broke out inside Goa nightclub
A viral video from Goa’s night club shows a belly dancer performing. However, moments after the ceiling catches fire, the performance stops.
The DJ removes his equipment and stops the music. Someone from the… pic.twitter.com/liLDvDnhyC
— The Indian Express (@IndianExpress) December 7, 2025
ఈ ఘోర ప్రమాదానికి భద్రతా వైఫల్యం కూడా కారణమని దర్యాప్తులో తేలింది. దాంతో.. భద్రతా నియమాలను ఉల్లంఘించినందున ఇప్పటివరకూ పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. నైట్ క్లబ్ యజమాని ఢిల్లీకి చెందని వాడని దర్యాప్తులో తెలిసింది. దాంతో.. అతడి కోసం గోవా పోలీసులు గాలిస్తున్నారు.