Air India | ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో (IndiGo)లో తీవ్ర సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. గత ఆరు రోజులుగా ఈ సంస్థకు చెందిన వందలాది విమానాలు రద్దు, ఆలస్యం అవుతున్నాయి. ఏడో రోజైన సోమవారం ఉదయం కూడా 400 విమానాలు రద్దయ్యాయి. ఇండిగో సంక్షోభం దేశీయ విమాన ప్రయాణ ఛార్జీలపై ప్రభావం పడింది. పలు ఎయిర్‌లైన్స్ టికెట్ రేట్లను భారీగా పెంచిన విషయం తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం టికెట్ ధరలపై పరిమితి విధించింది. ఈ మేరకు ఈనెల 6వ తేదీన మార్గదర్శకాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఈ ఆదేశాలకు అనుగుణంగా దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఎయిర్ ఇండియా (Air India) చర్యలు చేపట్టింది. టికెట్ రేట్లపై కేంద్రం విధించిన పరిమితిని నేటి నుంచి అమల్లోకి తెచ్చింది. ఈ పరిమితి ఎకానమీ క్లాస్ టికెట్లకు వర్తిస్తుందని (fares for economy tickets) తెలిపింది. ఈ మేరకు ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఎయిర్ ఇండియా ‘ఎక్స్’ వేదికగా ప్రకటించింది. ఈ మార్పుల వేళ ఎవరైనా ఎయిర్ ఇండియా ఎకానమీ క్లాస్ టికెట్లను నిర్ధరించిన బేస్ ధరల కంటే ఎక్కువకు బుకింగ్ చేసుకొంటే.. ఆ వ్యత్యాసం మొత్తం రిఫండ్ చేస్తామని స్పష్టం చేసింది. ఇండిగో విమాన సర్వీసుల సంక్షోభం దృష్ట్యా డిసెంబర్ 6న విమాన టికెట్ల ధరలను పౌర విమానయాన శాఖ క్రమబద్ధీకరించింది. ఈమేరకు ఆయా ఎయిర్‌లైన్స్‌కు మార్గదర్శకాలు జారీ చేసింది. దీనికి అనుగుణంగా ఎయిర్ ఇండియా తాజాగా చర్యలు చేపట్టింది.
టికెట్ ధరలపై కేంద్రం ఆదేశాలు
ఇండిగో సంక్షోభాన్ని ఆసరాగా చేసుకుని విమానయాన సంస్థలు టికెట్ ఛార్జీలను పెంచుతుండటంపై కేంద్రం స్పందించింది. విమాన చార్జీలపై పరిమితులను విధించింది.
దూరం గరిష్ఠ చార్జీ (రూ.)
500 కి.మీ. వరకు 7,500
500-1,000 కి.మీ. 12,000
1,000-1,500 కి.మీ. 15,000
1,500 కి.మీ.కిపైగా 18,000
Also Read..
IndiGo | ఏడో రోజూ ఇండిగో సంక్షోభం.. నేడు వందలాది విమానాలు రద్దు
Goa Night Club | గోవా నైట్‌క్లబ్‌లో భారీ అగ్నిప్రమాదం.. వెలుగులోకి సంచలన వీడియో
Vande Mataram Debate | వందేమాతరంపై నేడు లోక్‌సభలో చర్చ