సోమవారం 18 జనవరి 2021
National - Dec 18, 2020 , 01:34:24

తాజ్‌మహల్‌కు స్ఫూర్తి ఆ కట్టడం

తాజ్‌మహల్‌కు స్ఫూర్తి ఆ కట్టడం

న్యూఢిల్లీ: అదో అద్భుత కట్టడం.. భార్యపై అంతులేని ప్రేమతో ఓ భర్త నిర్మించిన అపురూప కట్టడం. కాలక్రమంలో నిర్లక్ష్యానికి గురైన ఆ కట్టడం మళ్లీ పునరుజ్జీవాన్ని సంతరించుకున్నది. అదే ఢిల్లీలోని అబ్దుర్‌ రహీమ్‌ ఖాన్‌ ఎ ఖానన్‌ సమాధి. ఆగ్రాలో 1653లో తాజ్‌మహల్‌ నిర్మాణానికి ఈ కడ్డటమే స్ఫూర్తి అని చరిత్రకారులు చెప్తారు. నిజాముద్దీన్‌ ప్రాంతంలో 1598లో ఈ కట్టడాన్ని రహీమ్‌ తన భార్య మాహ్‌ బాను జ్ఞాపకార్థం నిర్మించారు. రహీమ్‌ మరణం తర్వాత ఆయన భౌతిక ఖాయాన్ని కూడా ఇక్కడే ఖననం చేశారు.