పేదింటి ఆడబిడ్డలకు వరం కల్యాణలక్ష్మి
ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం పేదింటి ఆడబిడ్డలకు వరంగా మారాయని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.

వరంగల్ రూరల్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం పేదింటి ఆడబిడ్డలకు వరంగా మారాయని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. హన్మకొండలోని తన నివాసంలో లబ్ధిదారులకు రూ.15లక్షల విలువైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో ఆడబిడ్డ పుడితే తల్లితండ్రులు ఆందోళన చెందేవారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో ప్రస్తుత పరిస్థితులు మారాయన్నారు.
ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. కరోనా కష్టకాలంలో ఆదాయం తగ్గినా కూడా ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఆపకుండా అమలు చేస్తున్న ఘనత కేసీఆర్దేని పేర్కొన్నారు. కరోనా వైరస్ కట్టడికి ప్రజలు విధిగా ప్రభుత్వ నిబంధనలు పాటించాలన్నారు.
ఇవి కూడా చదవండి..
ప్రభుత్వ విప్ బాల్క సుమన్ను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత
పారిశుధ్య, ఆశా వర్కర్ల కృషి మరువలేనిది
నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ నమోదు : మంత్రి నిరంజన్ రెడ్డి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

