పారిశుధ్య, ఆశా వర్కర్ల కృషి మరువలేనిది
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి | కరోనా వ్యాప్తి చెందకుండా పారిశుద్ధ్య కార్మికులు, ఆశా వర్కర్లు చేస్తున్న కృషి మరువలేనిదని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.

నిర్మల్ : కరోనా వ్యాప్తి చెందకుండా పారిశుద్ధ్య కార్మికులు, ఆశా వర్కర్లు చేస్తున్న కృషి మరువలేనిదని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అక్షయ పాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులు, ఆశా వర్కర్లకు మంత్రి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, ఆశా వర్కర్లు, పోలీసులు, ఇతర ఫ్రంట్‌లైన్ వర్కర్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నారని, వారి రుణం తీర్చుకోలేనిదన్నారు.
అక్షయ పాత్ర ఫౌండేషన్ తమ వంతు సహకారంగా పారిశుధ్య కార్మికులు, ఆశా వర్కర్లకు నిత్యావసరాలు అందించడం అభినందనీయమన్నారు. జిల్లాలో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని, కరోనా కేసులు కూడా తక్కువగా ఉన్నాయని సీఎం కేసీఆర్అ భినందించారని మంత్రి గుర్తు చేశారు. అందరూ కరోనా నిబంధనలు పాటించాలన్నారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లా వెంకట్రామ్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు మారుగొండ రాము, రాంకిషన్ రెడ్డి, అల్లోల సురేందర్ రెడ్డి, అల్లోల మురళీధర్ రెడ్డి, అల్లోల గౌతంరెడ్డి, అల్లోల దివ్యారెడ్డి, రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
తీన్మార్ మల్లన్న కాన్వాయ్‌కు ప్రమాదంలో భార్య మృతి, భర్త పరిస్థితి విషమం
Harish Rao | కాంగ్రెస్ పాలన ఎల్‌నినో కంటే ప్రమాదకరం : మాజీ మంత్రి హరీష్‌రావు
trailer hits several vehicles | పలు వాహనాలను ఢీకొట్టిన 18 చక్రాల ట్రైలర్.. ఇద్దరు మృతి, ముగ్గురికి గాయాలు
Assam: ఖాజీరంగాలో ట్రక్కు, బస్సు ఢీ.. 23 మంది మృతి, ఏడు మందికి గాయాలు
తుంగతుర్తిలో నలుగురికి కుష్టు వ్యాధి నిర్ధారణ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

