Jammu and Kashmir | జమ్ము కశ్మీర్ (Jammu and Kashmir) లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పహల్గామ్ (Pahalgam) లోని బైసరన్ లోయలో కాల్పులకు తెగబడ్డారు. పర్యాటకులే (tourists) లక్ష్యంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న భద్రతా బలగాలు, వైద్య బృందాలు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. బైసరన్ లోయలో ట్రెక్కింగ్ ట్రిప్ కోసం వెళ్లిన పర్యాటకులపై గుర్తు తెలియని ముష్కరులు మంగళవారం మధ్యాహ్నం సమయంలో కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. గాయపడిన వారిలో ముగ్గురు స్థానికులు కాగా, మరో ముగ్గురు ఇతర ప్రాంతాలకు చెందిన వారిగా తెలుస్తోంది. ఈ ఘటన నేపథ్యంలో పహల్గామ్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
#WATCH | Firing incident reported in Pahalgam, J&K; Police and Security Forces present on the spot
Details awaited. pic.twitter.com/jlDZ1oubnB
— ANI (@ANI) April 22, 2025
Also Read..
PM Modi | ప్రత్యేక స్వాగతం.. ప్రధాని మోదీ విమానానికి ఎస్కార్ట్గా సౌదీ ఫైటర్ జెట్లు.. VIDEO
Pope Francis | శనివారం పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు : వాటికన్
Bus Crash: వ్యాన్ లోయలో పడి 16 మంది మృతి