Bus Crash: వ్యాన్ లోయలో పడి 16 మంది మృతి
Bus Crash: కార్మికులతో వెళ్తున్న బస్సు పాకిస్థాన్‌లో లోయలో పడింది. ఈ ప్రమాదంలో 16 మంది మరణించారు. మరో 30 మంది గాయపడ్డారు. వ్యవసాయ కూలీలు ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు.
కరాచీ: దక్షిణ పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో 16 మంది మరణించారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారు. సుమారు 30 మంది గాయపడ్డారు. సింధు ప్రావిన్సులోని జామ్‌షోరో జిల్లాలో ఈ దుర్ఘటన జరిగింది. అతి వేగంతో వెళ్తున్న డ్రైవర్.. బస్సును అదుపు చేయలేకపోయినట్లు తెలుస్తోంది. స్పాట్లోనే 16 మంది ప్రాణాలు కోల్పోయారు.
పంజాబ్ ప్రావిన్సులోని కొల్హి తెగకు చెందిన వ్యక్తులు సింధు ప్రావిన్సుకు వెళ్తున్నారు. పోలీసులు, రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రమాద బాధితులను సమీప ఆస్పత్రికి తరలించారు. బలోచిస్తాన్లో గోధుమ పంట కోత తర్వాత కార్మికులు తమ స్వస్థలానికి తిరిగి వెళ్తున్న సమయంలో బస్సు ప్రమాదానికి గురైంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నది. గాయపడ్డవారిలో చాలా మంది ఆరోగ్యం విషమంగా ఉన్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణ’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దుమ్మురేపిన రణ్‌బీర్ కపూర్.. ఒక్కరోజులోనే రూ.5.35 కోట్ల వసూళ్లు!
Election Break | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు తాత్కాలిక బ్రేక్
Vijay Deverakonda | రాత్రి 11.40కి అల్లు అర్జున్‌కి విజయ్ దేవరకొండ కాల్.. అసలు కారణం ఇదే!
The Paradise | ఓటీటీలో ‘ది ప్యారడైజ్’.. ఏకంగా 24 నిమిషాల సీన్లు కట్, నెట్‌ఫ్లిక్స్‌లో కొత్త వెర్షన్!
Road Accident | కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రుల సంతాపం..బాధిత కుటుంబాలను ఆదుకుంటాం
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

