PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. రెండు రోజుల పాటు ఆయన సౌదీలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఇవాళ ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సౌదీ బయల్దేరి వెళ్లారు.
ఈ సందర్భంగా ప్రధానికి సౌదీ ప్రభుత్వం ప్రత్యేకంగా స్వాగతం పలికింది. మోదీ ప్రయాణిస్తోన్న విమానం ఆ దేశ గగనతలంలోకి (Saudi airspace) ప్రవేశించగానే.. రాయల్ సౌదీ ఎయిర్‌ఫోర్స్ (Royal Saudi Air Force)కు చెందిన ఎఫ్-15 విమానాలు దానిని ఎస్కార్ట్‌గా వచ్చాయి. మోదీ విమానానికి ఇరువైపులా మూడేసి చొప్పున ఆరు జెట్ ఫైటర్లు ఎస్కార్ట్‌గా నిలిచి స్వాగతం పలికాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
As a special gesture, the Prime Minister Narendra Modi’s aircraft was escorted by F-15s of the Royal Saudi Air Force in Saudi airspace.
(Pic Source: MEA) pic.twitter.com/UgeKWWOul0
— ANI (@ANI) April 22, 2025
సౌదీకి బయలుదేరి వెళ్లడానికి ముందు ప్రధాని ఓ ట్వీట్ చేశారు. ఇటీవల రెండు దేశాల మధ్య బంధం మరింత దృఢమైందన్నారు. రక్షణ, వాణిజ్య, పెట్టుబడి, ఎనర్జీ రంగాల్లో సహకారం పెరిగిందన్నారు. ప్రాంతీయంగా శాంతి, సామరస్యం, స్థిరత్వం ప్రమోట్ చేసేందుకు రెండు దేశాలు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. మూడోసారి మోదీ సౌదీకి వెళ్తున్నారు. ఆయన జెడ్డాకు వెళ్లడం ఇదే మొదటిసారి. రెండవ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొనున్నారు. ప్రధాని తన పర్యటనలో జెడ్డాలో ఆ దేశంతో ఆరు ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. సౌదీ ఆరేబియా చక్రవర్తి మహమ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్‌తో జరిగే చర్చల్లో భారతీయ యాత్రికులకు చెందిన హజ్ కోటా గురించి మాట్లాడనున్నారు.
#WATCH | In a special gesture, fighter planes from Saudi Arabia escort Prime Minister Narendra Modi’s plane as it entered Saudi airspace to Jeddah. pic.twitter.com/Vhzxd6ir5p
— ANI (@ANI) April 22, 2025
Also Read..
PM Modi: సౌదీ ఆరేబియాకు ప్రధాని మోదీ.. హజ్ కోటాపై ప్రిన్స్‌తో చర్చలు
Gold Prices | ఆల్‌టైమ్ రికార్డ్.. రూ.లక్ష దాటిన బంగారం ధరలు
Nitin Gadkari | వాహనాలకు హారన్లుగా భారతీయ సంగీత పరికరాల శబ్దాలు : కేంద్ర మంత్రి గడ్కరీ