Gold Prices | ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి కారణంగా బంగారం ధరలు (Gold Prices) రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి. సంపన్నులకే దడ పుట్టించేలా ప్రస్తుతం బంగారం రేట్లు పెరుగుతూపోతున్నాయి. తాజాగా బంగారం ధరలు ఆల్‌టైమ్ హైకి తాకాయి. మంగళవారం దేశీయంగా 24 క్యారెట్ 10 గ్రాముల పుత్తడి ధర ఏకంగా రూ.లక్ష దాటింది. ఢిల్లీ (Delhi), ముంబై, కోల్‌కతా, చెన్నై సహా అన్ని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన ఒక గ్రాము బంగారం ధర రూ.10,000 పైనే పలుకుతోంది.
అత్యధికంగా దేశరాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన పది గ్రాముల బంగారం ధర రూ.1,02,160కు చేరింది. ఢిల్లీలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన గ్రాము బంగారం ధర రూ.10,150గా ఉంది. నోయిడా, గురుగ్రామ్, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా నగరాల్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన గ్రాము బంగారం ధర రూ.10,135గా ఉంది. రానున్న రోజుల్లో తులం బంగారం ధర రూ.1.50 లక్షలకు చేరుకునే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
కరెన్సీ మార్కెట్లో అమెరికన్ డాలర్ బలహీనపడటం, అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం కొనసాగుతుండటం.. గోల్డ్ మార్కెట్‌ను షేక్ చేస్తున్నది. స్టాక్ మార్కెట్లలో ఒడిదుడుకులు నెలకొనడంతో మదుపరులు తమ పెట్టుబడులను పసిడి వైపునకు మళ్లిస్తున్నారు. ఇక బహిరంగ మార్కెట్లో ధరల పెరుగుదలతో కొనుగోలుదారుల నుంచి పెద్దగా గిరాకీ లేకున్నా.. జ్యుయెల్లర్స్, రిటైలర్స్ నుంచి డిమాండ్ కనిపిస్తున్నది. ఈ క్రమంలోనే మార్కెట్లో పుత్తడి ధరలు దౌడు తీస్తున్నాయని మెజారిటీ నిపుణుల విశ్లేషణ. కాగా, అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ ప్రతీకార సుంకాల ప్రభావం చైనా మినహా మిగతా దేశాలపై ఆగినా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మాత్రం ఆ సెగ తగులుతూనే ఉన్నది. ఈ క్రమంలో ఆయా దేశాలతో జరుగుతున్న అమెరికా ట్రేడ్ డీల్స్నుబట్టి భవిష్యత్తులో బంగారం రేట్ల పెరుగుదలలో వేగం ఉంటుందని అంచనా వేస్తున్నారు.
Also Read..
Donald Trump: ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ చీఫ్‌పై ట్రంప్ విమర్శలు.. అమెరికా స్టాక్స్, డాలర్ పతనం
Stock markets | దేశీయ స్టాక్ మార్కెట్స్‌లో లాభాల జోష్.. వరుసగా ఐదో సెషన్లోనూ బుల్ జోరు
Rs.500 Notes | పెద్ద ఎత్తున చెలామణీలోకి ఫేక్ రూ.500 నోట్లు.. ఎలా గుర్తించాలంటే..?