Nitin Gadkari | కేంద్ర రోడ్డు, రవాణా శాఖల మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) ఓ సరికొత్త ప్రతిపాదనతో దేశ ప్రజల ముందుకొచ్చారు. వాహనాలకు హారన్లు (vehicle horns)గా భారతీయ సంగీత పరికరాల శబ్దాలు (Indian musical instruments sound) మాత్రమే వచ్చేలా త్వరలో చట్టం తేవాలని యోచిస్తున్నట్లు చెప్పారు.
నవభారత్ టైమ్స్ 78వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గడ్కరీ ప్రసంగించారు. అన్ని వాహనాలకు హారన్లుగా భారతీయ సంగీత పరికరాలు ఉత్పత్తి చేసే శబ్దాలనే వినియోగించేలా చట్టం తీసుకొచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ఫ్లూట్, తబలా, వయెలిన్, హార్మోనియం వంటి వాయిద్య పరికరాల ద్వారా వచ్చే శబ్దాలు ఇందులో ఉంటాయని చెప్పారు. ఆయా ధ్వనులు వినడానికి ఎంతో హాయిగా ఉంటుందని తెలిపారు.
ఇదే కార్యక్రమంలో వాయుకాలుష్యంపై (air pollution) కూడా నితిన్ గడ్కరీ మాట్లాడారు. దేశంలో మొత్తం వాయు కాలుష్యం రవాణా రంగం వాటా 40 శాతం వరకు ఉంటుందని చెప్పారు. దీన్ని ఎదుర్కొనేందుకు మోదీ ప్రభుత్వం మిథనాల్, ఇథనాన్తో నడిచే వాహనాలను ప్రోత్సహిస్తోందని తెలిపారు. ఇక భారత్‌లో ఆటోమొబైల్ పరిశ్రమ బలాన్ని కూడా గడ్కరీ హైలెట్ చేశారు. కార్లు, ద్విచక్ర వాహనాల ఎగుమతి ద్వారా దేశం గణనీయమైన ఆదాయాన్ని అర్జిస్తున్నట్లు చెప్పారు. 2014లో భారత ఆటోమొబైల్ రంగం విలువ రూ.14 లక్షల కోట్లు కాగా, ఇప్పుడు అది రూ.22 లక్షల కోట్లకు పెరిగినట్లు చెప్పారు. మన ఆటోమొబైల్ మార్కెట్ జపాన్ను అధిగమించి అమెరికా, చైనా తర్వాత మూడో స్థానంలో నిలిచిందన్నారు.
Also Read..
Zeeshan Siddique | మీ నాన్నను చంపినట్లే నిన్ను కూడా.. బాబా సిద్ధిఖీ కుమారుడికి హత్య బెదిరింపులు
Gold Prices | ఆల్‌టైమ్ రికార్డ్.. రూ.లక్ష దాటిన బంగారం ధరలు
JD Vance | జైపూర్ అంబర్ ఫోర్ట్‌ను సందర్శించిన జేడీ వాన్స్ ఫ్యామిలీ