IED Blast | రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మరో దారుణం జరిగింది. నడిరోడ్డుపై మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలడంతో.. ఓ పదేండ్ల బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయాన్ని పోలీసులు ధృవీకరించారు.
చింతల్నార్ పోలీసు స్టేషన్ పరిధిలోని తిమ్మాపురం గ్రామ శివార్లలో మావోయిస్టులు ఐఈడీ బాంబును అమర్చారు. అయితే ఆదివారం సాయంత్రం ఆ రహదారి గుండా ఓ బాలిక నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఐఈడీ పేలిపోయింది. దీంతో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనతో తిమ్మాపురం గ్రామంతో పాటు ఆ పరిసర ప్రాంతాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అక్కడ పోలీసులు కూంబింగ్ ముమ్మరం చేశారు. మావోయిస్టుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే బస్తర్ రీజియన్‌లో ఐఈడీలు అమర్చి పేల్చడం ఇటీవలి కాలంలో సాధారణమైపోయిందని పోలీసులు పేర్కొన్నారు. ఈ రీజియన్‌లో సుక్మా, బీజాపూర్, నారాయణపూర్ జిల్లాలతో పాటు మరో నాలుగు జిల్లాలు న్నాయి.
ఆదివారం బీజాపూర్ జిల్లాలో ఐఈడీ పేలడంతో ఇద్దరు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. శనివారం ఓ సీఆర్పీఎఫ్ జవాన్ గాయపడ్డారు. జనవరి 10వ తేదీన నారాయణపూర్ జిల్లాలో ఐఈడీ పేలడంతో ఓ వ్యక్తి చనిపోయాడు. జనవరి 6న బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు ఐఈడీ పేల్చడంతో 8 మంది పోలీసులు, ఒక డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు.
ఇవి కూడా చదవండి..
Maha Kumbh Mela | కుంభమేళాకు తరలివస్తున్న భక్తులు.. త్రివేణి సంగమంలో లక్షలాది మంది పవిత్ర స్నానాలు
Atishi | అతిశీ క్రౌడ్ ఫండింగ్‌కు విశేష స్పందన.. ఒక్కరోజులోనే రూ.18 లక్షలు
Maha Kumbh | 144 సంవత్సరాల తర్వాత మహా కుంభమేళా..! ఈ ఆరు రోజులు మరీ స్పెషల్..!