Atishi | అసెంబ్లీ ఎన్నికల (Delhi Assembly elections) నేపథ్యంలో ఢిల్లీ సీఎం (Delhi CM) అతిశీ (Atishi) ప్రారంభించిన క్రౌడ్ ఫండింగ్ (crowdfunding)కు విశేష స్పందన లభించింది. ఈ ఫండింగ్‌ను ప్రకటించిన 24 గంటల వ్యవధిలోనే భారీగా విరాళాలు అందాయి.
ఢిల్లీ ఎన్నికల్లో పోటీ కోసం తనకు రూ.40 లక్షలు అవసరమని ఢిల్లీ సీఎం అతిషి ఆదివారం తెలిపిన విషయం తెలిసిందే. ఆప్ ఎల్లప్పుడూ సామాన్యుల నుంచి వచ్చే చిన్న విరాళాల సహాయంతో ఎన్నికల్లో పోరాడిందని చెప్పారు. ఈ మేరకు ఎన్నికల్లో పోటీకి అవసరమైన డబ్బును ప్రజల నుంచి విరాళంగా పొందేందుకు ఆన్లైన్ లింక్‌ను విడుదల చేశారు. దాని ద్వారా ఇప్పటి వరకూ రూ.18.56 లక్షలు విరాళంగా వచ్చాయి. 422 మంది దాతలు ఈ విరాళాన్ని అందించారు.
కాగా, 70 మంది సభ్యులున్న ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 5న ఎన్నికలు జరుగుతాయి. ఫిబ్రవరి 8న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు. ఇక ఈ ఎన్నికల్లో అతిశీ కల్కాజీ స్థానం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ స్థానినికి మరికాసేపట్లో నామినేషన్ కూడా దాఖలు చేయనున్నారు. ఈ క్రమంలో నామినేషన్‌కు ముందు కల్కాజీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
#WATCH | Delhi CM and AAP candidate from the Kalkaji Assembly constituency, Atishi offers prayers at the Kalkaji Temple pic.twitter.com/IqrUzMFYuA
— ANI (@ANI) January 13, 2025
Also Read..
Atishi | అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి.. క్రౌడ్ ఫండింగ్ ప్రచారాన్ని ప్రారంభించిన ఢిల్లీ సీఎం అతిషి
Maha Kumbh | 144 సంవత్సరాల తర్వాత మహా కుంభమేళా..! ఈ ఆరు రోజులు మరీ స్పెషల్..!
Maha Kumbh | మహా కుంభమేళాకు భారతీయ రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు.. పట్టాలపైకి 13వేల రైళ్లు..!