Atishi | అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి.. క్రౌడ్ ఫండింగ్ ప్రచారాన్ని ప్రారంభించిన ఢిల్లీ సీఎం అతిషి
Atishi | దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకురాలు, సీఎం అతిషి తర్వలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కల్కాజీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. దీని కోసం క్రౌడ్ ఫండింగ్ ప్రచారాన్ని ఆదివారం ఆమె ప్రారంభించారు.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకురాలు, సీఎం అతిషి (Atishi) తర్వలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కల్కాజీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. దీని కోసం క్రౌడ్ ఫండింగ్ ప్రచారాన్ని ఆదివారం ఆమె ప్రారంభించారు. తన పార్టీ పని, నిజాయితీ రాజకీయాలకు ప్రజలు మద్దతు ఇస్తారని ఆశిస్తున్నట్లు అన్నారు. ఎన్నికల్లో పోటీకి అవసరమైన డబ్బును ప్రజల నుంచి విరాళంగా పొందేందుకు ఆన్లైన్ లింక్‌ను విడుదల చేశారు.
కాగా, ఢిల్లీ ఎన్నికల్లో పోటీ కోసం తనకు రూ.40 లక్షలు అవసరమని ఢిల్లీ సీఎం అతిషి తెలిపారు. ఆప్ ఎల్లప్పుడూ సామాన్యుల నుంచి వచ్చే చిన్న విరాళాల సహాయంతో ఎన్నికల్లో పోరాడిందని చెప్పారు. పార్టీ పని తీరు, నిజాయితీ రాజకీయాలను కొనసాగించడంలో ఇది సహాయపడిందని ఆమె అన్నారు.
మరోవైపు ఒక వీడియో క్లిప్‌ను కూడా ఎక్స్‌లో అతిషి పోస్ట్ చేశారు. ‘గత ఐదేళ్లుగా ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న నాకు మీరు మద్దతుగా నిలిచారు. మీ ఆశీస్సులు, మద్దతు లేకుండా ఇవేవీ సాధ్యం కాదు’ అని తన నియోజకవర్గం ప్రజలనుద్దేశించి అన్నారు.
కాగా, 70 మంది సభ్యులున్న ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 5న ఎన్నికలు జరుగుతాయి. ఫిబ్రవరి 8న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు.
Over the past 5 years, you’ve stood by me as an MLA, a minister, and now as the Chief Minister of Delhi. None of this would have been possible without your blessings and support.
As a young, educated woman, your belief and donations have enabled me to imagine a career in… pic.twitter.com/WbsdqNCGhh
— Atishi (@AtishiAAP) January 12, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

