Maha Kumbh Mela | ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా పేరొందిన మహా కుంభమేళా (Maha Kumbh Mela) ఘనంగా ప్రారంభమైంది. గంగా, యమునా, సరస్వతీ నదులు కలిసే ప్రదేశమైన ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని ప్రయాగ్‌రాజ్ (Prayagraj)కు భక్తులు (devotees) పోటెత్తుతున్నారు. తొలి రోజు పుష్య పౌర్ణమి సందర్భంగా సోమవారం తెల్లవారుజాము నుంచే లక్షలాది మంది భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 9:30 గంటల వరకూ దాదాపు 60 లక్షల మందికిపైగా భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించారు.
సంక్రాతి నుంచి శివరాత్రి వరకు అంటే జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 రోజులపాటు జరిగే ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి కోట్ల మంది భక్తులు, పర్యాటకులు తరలి రానున్నారు. సుమారు 45 కోట్ల మంది భక్తులు పవిత్ర స్నానాలు చేయడానికి వస్తారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేస్తున్నది. మరోవైపు ఈ కుంభమేళాకు యూపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేసింది. భారీగా పోలీసు, భద్రతా బలగాలను మోహరించడంతోపాటు అడుగడుగునా సీసీ కెమెరాను ఏర్పాటు చేసింది. డ్రోన్ కెమెరాలతో పరిస్థితులను పరిశీలిస్తున్నది. ఏఐ టెక్నాలజీని కూడా వినియోగిస్తున్నారు.
దాదాపు 10 వేల ఎకరాల పరిధిలో ఆధ్యాత్మిక నగరాన్ని ఏర్పాటు చేశారు. ఏసమయంలోనైనా 50 లక్షల మంది నుంచి కోటి మంది ఉండగలిగేలా సౌకర్యాలు కల్పించారు. భక్తులకు సదుపాయాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.7 వేల కోట్లు ఖర్చు చేస్తున్నది. ఎన్డీఆర్ఎఫ్ వాటర్ అంబులెన్స్‌లను ఏర్పాటు చేసింది. యాత్రికులకు ఇబ్బంది లేకుండా 1.6 లక్షల టెంట్లను, 1.5 లక్షల మరుగు దొడ్లను నిర్మించారు. భద్రత కోసం 55 పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయడంతోపాటు 45 వేల మంది పోలీసులను మోహరించారు.
#WATCH | Prayagraj, Uttar Pradesh: Devotees took a holy dip in Triveni Sangam – a sacred confluence of rivers Ganga, Yamuna and ‘mystical’ Saraswati as today, January 13 – Paush Purnima marks the beginning of the 45-day-long #MahaKumbh2025
(Earlier visuals) pic.twitter.com/fVmy3YyUkN
— ANI (@ANI) January 13, 2025
Also Read..
Maha Kumbh | 144 సంవత్సరాల తర్వాత మహా కుంభమేళా..! ఈ ఆరు రోజులు మరీ స్పెషల్..!
Maha Kumbh | మహా కుంభమేళాకు భారతీయ రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు.. పట్టాలపైకి 13వేల రైళ్లు..!
Maha Kumbh Mela | ప్రారంభమైన మహా కుంభమేళా.. భక్త జనసంద్రంగా ప్రయాగ్‌రాజ్